బిజెపి తెలంగాణ దండయాత్ర, తెలంగాణ కైవసానికి బిజెపి 10 పాయింట్ ఫార్ములా
2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు.... ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లలో రెండు కైవసం. తెలంగాణపై బిజెపి పట్టు బిగిస్తోందా? మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఊహించని విధంగా వ్యూహాత్మక గెలుపు సాధించిన బిజెపి తన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణకే ఫిక్స్ చేసింది.

2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు…. ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లలో రెండు కైవసం. తెలంగాణపై బిజెపి పట్టు బిగిస్తోందా? మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఊహించని విధంగా వ్యూహాత్మక గెలుపు సాధించిన బిజెపి తన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణకే ఫిక్స్ చేసింది. ఇప్పటివరకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన తెలంగాణని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలనేది బిజెపి ప్లాన్. అందుకు మూడేళ్ల ముందు నుంచే టెన్ పాయింట్ ఫార్ములా డిజైన్ చేసింది. బిజెపి తెలంగాణ వ్యూహంపై డయల్ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.
27 ఏళ్లుగా దక్కించుకో లేకపోయిన ఢిల్లీ అసెంబ్లీ చివరికి ఇప్పుడు బిజెపి చేతికి చిక్కింది. దేశంలో మొత్తం 21 రాష్ట్రాల్లో అధికారం చలాయిస్తుంది బిజెపి. వీటిలో ఆరు రాష్ట్రాల్లో కూటములతో కలిసి అధికారాన్ని పంచుకోగా, 15 రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.2014 లో మొదలైన మోడీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. మోడీ ,అమిత్ షా కాంబినేషన్లో ఇన్ని విజయాలు అందుకున్న బిజెపి కి తెలంగాణ మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. కర్ణాటక ఒకసారి చేయి జారిపోయినప్పటికీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రం మళ్లీ బిజెపి కైవసం అయిపోతుంది. ఎప్పటికీ అధికారం దక్కని రాష్ట్రాలుగా కేరళ ,తమిళనాడు, తెలంగాణ మిగిలిపోయాయి. కేరళ, తమిళనాడు కంటే ఇప్పుడు తెలంగాణపై కర్చీఫ్ వేయడం బిజెపికి తేలిక. అందుకే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికార స్థాపన కోసం తిరుగులేని వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది బిజెపి. అందుకోసం పది పాయింట్లు ప్లాన్ సిద్ధం చేసింది.
ప్రత్యేక రాష్ట్రం, ప్రాంతీయ వాదంపై తెలంగాణ ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిపోయింది. ఇప్పుడు ఇక ప్రాంతీయవాదానికి ఇక్కడ విలువలేదు. మరో కొత్త వాదం ఎంచుకుంటేనే రాజకీయ పార్టీలకు మనుగడుంటుంది. అధికారం కైవసం అవుతుంది. కాంగ్రెస్ అంటే రెడ్లు. టిఆర్ఎస్ అంటే వెలమలు.అగ్రకులాలే అధికారం చలాస్తున్నాయి. అందువలన తెలంగాణలో కుల వాదం లేపగలిగితే…. ఆ పార్టీకి ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుంది. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అధికారం, అనే నినాదాన్ని ఎత్తుకోవాలన్నదే బిజెపి టెన్ పాయింట్ ఫార్ములా లో మొదటిది. పైకి ఎన్ని కబుర్లు చెప్పిన కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీలకు సహజంగానే బీసీలు గురించి మాట్లాడే హక్కు ఉండదు. ఆ పార్టీలు బీసీ ఎస్సీలకు ఎప్పటికీ అధికారం కట్టబెట్టవు అనేది జనంలో స్పష్టంగా ఉంది. ఎస్సీ ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించిన కేసీఆర్ 10 ఏళ్ల అధికారాన్ని తన కుటుంబానికే పరిమితం చేసి దారుణంగా మాట తప్పాడు. అందుకే కెసిఆర్ బీసీలు, ఎస్సీలు జపం చేసిన…. ఎవడు నమ్మడు. ఇక కాంగ్రెస్ అంటేనే రెడ్లు. రెడ్లకు తప్ప మరొకరికి అధికారం కట్టబట్ట లేని పరిస్థితి కాంగ్రెస్ లో ఉంటుంది.
ఎస్సీ ని డిప్యూటీ సీఎం చేసిన, బీసీని పీసీసీ అధ్యక్షుడిని చేసిన ,సీఎం పోస్టు మాత్రం రెడ్లదే. అందుకే బిజెపి ఈసారి బీసీ సీఎం నినాదం ఇవ్వబోతోంది. ప్రధానమంత్రి మోడీ బీసీ. ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా బీసీ యే కావాలి… బీసీలకు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పట్టం కట్టే నిబద్ధత బిజెపికే ఉంది అనేది నిరూపించాలన్నది ఆ పార్టీ వ్యూహం. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి… బీసీలకే అధికారం అనే బలమైన నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లబోతోంది బిజెపి. నిజానికి బీసీలందరినీ ఐక్యంగా ఒక గొడుగు కి ఎందుకు తీసుకురావడం చాలా కష్టం. అనేక కులాలు బీసీల్లో ఉంటాయి. అయితే రాబోయే మూడున్నర ఏళ్లలో బీసీలందరినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు బలమైన ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది బిజెపి.
సహజంగానే ఆంధ్ర తెలంగాణలో రాజకీయాల్లో మతం పని చేయదని ఒక అంచనా. కానీ క్రమంగా హిందూమత భావనను తెలంగాణలో ఎక్కించ గలిగారు బిజెపి వాళ్లు. లోక్సభ ఎన్నికల్లో ఇది రుజువైంది. అయోధ్య ప్రభావం ఎంతో కొంత పనిచేసింది. తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడంలో ప్రధాని మోడీ ఇమేజ్ తో పాటు, అయోధ్య అంశం కూడా బాగా పనిచేస్తుంది. అంతేకాక ఇంటింటికి అక్షింతలు పంపడం లాంటి కార్యక్రమాలు ఓట్లు దండిగా రాల్చాయి.కుంభమేళా తో కూడా జనం బాగా కనెక్ట్ అయ్యారు. తద్వారా పట్టణ ప్రాంతాల్లో బిజెపికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అందుకేహిందుత్వాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని ఈ రానున్న మూడు ఏళ్లలో రకరకాల హిందూ ధార్మిక కార్యక్రమాలతో జనాన్ని ఏకం చేసి బిజెపికి దగ్గర చేయాలన్నది అపార్టీ లక్ష్యం.
బిజెపికి తెలంగాణలో గ్రౌండ్ మొత్తం సెట్ చేసే పనిని ఆర్ఎస్ఎస్ తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక చిన్న శాంపిల్ టెస్ట్ చేయడం ద్వారా తెలంగాణలో ఆర్ఎస్ఎస్ భవిష్యత్తు వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుంది. కనీసం నాలుగు వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తెలంగాణలోకి దిగుతారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోనూ ఇంటింటికి వెళ్లి బిజెపి ఆవశ్యకతని, హైందవమత , సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణపై జనానికి అవగాహన కలిగిస్తారు. తద్వారా బిజెపికి జనంలో ఆదరణ పెంచుతారు. బిజెపి హై కమాండ్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడానికి ముందే ఇక్కడ గ్రౌండ్ క్లియర్ చేస్తుంది ఆర్ఎస్ఎస్. కనీసం నాలుగు వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే తెలంగాణ గ్రౌండ్లో పని మొదలుపెట్టారు. డోర్ టు డోర్ కమ్యూనికేషన్ మెథడాలజీలో జనంతో సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నారు.
మోడీ బ్రాండ్ ని తెలంగాణలో రానున్న మూడేళ్లలో మరింత విస్తృతం చేయడం. ప్రధాని వీలున్నప్పుడల్లా రాష్ట్రానికి రావడం. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది. మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ఏదో విధంగా నెట్టుకొచ్చి మరో 10 ఏళ్ళు అంతర్దానం అయిపోతుంది. అది పక్కా. మోడీ బ్రాండ్ ని రాహుల్ గాంధీ ఏ రకంగానూ బ్రేక్ చేయలేకపోతున్నారు. అది ఢిల్లీ ఎలక్షన్స్ లో మరోసారి రుజువైంది.
అందుకే తెలంగాణలో నరేంద్ర మోడీ చరిస్మాని మరింత పెంచాలని బిజెపి ప్లాన్.11 ఏళ్లు ప్రధానిగా పనిచేసిన మోడీపై అవినీతి ఆరోపణలు లేవు. ఆయనకు కుటుంబ జీవితం కూడా లేదు. అలాగే వ్యాపారాలు, ఇతర వ్యవహారాలు కూడా లేవు. వారసులు లేరు. దీంతో వ్యక్తిగా , నాయకుడిగా మోడీకి సూపర్ ఇమేజ్ ఉంది. పైగా మోడీ హిందూ మత బ్రాండ్ అంబాసిడర్. అందువల్లే మోడీ ఇమేజ్ ని తెలంగాణ లో ఎంత వీలైతే అంత వినియోగించాలని బిజెపి వ్యూహం.
2028 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి కాంగ్రెస్ కి బంగారు కంచంలో అధికారం అప్పు చెప్పిన టిఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. కవిత ఇరుక్కోవడం, కేటీఆర్ పై కూడా అవినీతి ఆరోపణ రావడం బి ఆర్ ఎస్ ఇమేజ్ ని దారుణంగా దెబ్బతీశాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన టి.ఆర్.ఎస్ ,బి ఆర్ ఎస్ గా మారడం కూడా ఆ పార్టీని దెబ్బతీసింది. వీటన్నిటిని అంచనా వేసుకుని టిఆర్ఎస్ను పూర్తిగా లేకుండా చేయడమే బిజెపి లక్ష్యం. అందుకే సాధ్యమైనంత వరకు టిఆర్ఎస్ నాయకుల్ని ఎక్కువగా బిజెపిలో చేర్చుకోబోతున్నారు. ఎప్పటికిప్పుడు స్థానికంగా బలం పెంచుకోవాలంటే బిజెపికి సాధ్యం కాదు. అందుకే బి ఆర్ ఎస్ లో ముఖ్య నేతలు అందరిని, బిజెపిలోకి లోకి లాగాలన్నది ఆ పార్టీ వ్యూహం. బి ఆర్ ఎస్ నీ బలహీనపరిస్తే ఆ పార్టీ ఓట్ సీరంతా తనకే వస్తుందని బిజెపి అంచనా. అందువలన టిఆర్ఎస్ కేడర్ ని కకావికులను చేసి సగం మంది నాయకుల్ని పార్టీలోకి రాగాలన్నది బిజెపి బలమైన వ్యూహం.
తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లు పాలించిన బి.ఆర్.ఎస్ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేసింది. ఇప్పటికే ప్రజలందరికీ దీనిపై ఒక అవగాహన ఉంది. తెలంగాణ సాధనలో కెసిఆర్ ఎంత కీలక పాత్ర పోషించినప్పటికీ ఆయన కుటుంబం, ముఖ్య నాయకులు పదేళ్లపాటు భయంకరమైన అవినీతికి పాల్పడ్డారని, లక్షల కోట్ల రూపాయలు దోచేశారన్నది అందరికీ తెలిసిన విషయం. ఇక 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాదిలోనే పూర్తిగా అవినీతిమయమైపోయింది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు అనే విషయం ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయింది. ఈ రెండు పార్టీలు పూర్తిగా అవినీతిమయమయ్యాయని, తెలంగాణను దోచుకున్నాయని అవినీతి వ్యతిరేక ప్రచారం చేయబోతోంది బిజెపి. సహజంగానే బిజెపి నేతలపై అవినీతి ఆరోపణలు లేవు. దీంతో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ అవినీతిమయమైన పార్టీలని ప్రచారం చేయడం బిజెపికి మరింత సులువు అవుతుంది.
తెలంగాణకి ఏం చేశారో చెప్పడం. బిజెపి తెలంగాణకు ఏం చేయలేదని, తెలంగాణ సాధనలోను ఆ పార్టీ పాత్ర అంతంత మాత్రమేనని కాంగ్రెస్, బి ఆర్ఎస్ ,నిత్యం చెపుతూ ఉంటాయి. కేంద్రం రాష్ట్రాన్ని దోచుకుందని, ఆదాయ వనరుగా మార్చుకుందని కెసిఆర్ ఎప్పుడూ తిట్టిపోస్తూనే ఉండేవారు. అందుకే తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో, ఇంకా ఏం చేయబోతుందో చెప్పే బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికి పూర్తిగా అప్పగించింది బిజెపి అధినాయకత్వం. చేసిన పని చెప్పుకోలేకపోవడం కూడా ఒక వైఫల్యమేనని బిజెపి అధిష్టానం భావిస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే నాయకులకు అక్షింతలు కూడా పడ్డాయి. అందుకే ఇకనుంచి కేంద్రం తెలంగాణకి ఏం చేసిందో గట్టిగా చెప్పాలని తన వ్యూహంలో భాగంగా నిర్ణయించింది.
దేశం మొత్తం బిజెపి బలపడిన తెలంగాణలో మాత్రం సంస్థగతంగా బలపడలేకపోయింది బిజెపి. ఉమ్మడి రాష్ట్రం ఉన్న రోజుల్లో వెంకయ్య నాయుడు లాంటివాళ్ళు టిడిపి లాంటి పార్టీలతో అంట కాకి బిజెపిని ని ఎదగకుండా చేశారు. ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చి, మూడుసార్లు కుర్చీ నీ కైవసం చేసుకున్నప్పటికీ మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ బలమైన క్యాడర్ ని ఏర్పాటు చేసుకోలేకపోయింది బిజెపి. హైదరాబాద్ సిటీ, ఆదిలాబాద్, మెదక్ ఇస్తే తెలంగాణలో గట్టి క్యాడర్ కూడా లేదు. కిషన్ రెడ్డి లాంటి నాయకులు మరో వెంకయ్య నాయుడులా పార్టీకి నమ్మకస్తులుగా ఉంటారే తప్ప.. ఎదుగుదలకు చేసింది శూన్యం. అందుకే బలహీనమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ కేడర్ ని బలోపేతం చేయాలన్నది… అది వీలైనంత త్వరగా రెండేళ్లలో పూర్తి చేయాలన్నది బిజెపి ప్లాన్.
ఒక రాష్ట్రం సింగిల్ గా దొరికితే…. ఆ సమయంలో వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోతే… ఆ ఒక్క రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికలు ఉంటే…. రాష్ట్రాన్ని బిజెపి కబ్జా పెట్టేసినట్లే. అలా ఇప్పటికీ చాలాసార్లు సింగిల్ స్టేట్ పై దేశం మొత్తం బిజెపి నాయకులు క్యాడర్ ఫోకస్ చేసి ఆ రాష్ట్రాన్ని గెలుచుకుంటాయి. నిన్నగాక మొన్న ఢిల్లీలో కూడా అదే రుజువైంది. ఏ రాష్ట్రమైనా సింగిల్ గా దొరికితే దేశంలో ఆర్ఎస్ఎస్ క్యాడర్, బిజెపి క్యాడర్, అన్ని స్థాయిల్లో నాయకులు మొత్తం ఆ రాష్ట్రం మీద పడిపోతారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తారు. అప్పుడు గెలుపు చాలా సులువు అయిపోతుంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్, బిజెపి క్యాడరు అన్ని ప్రాంతాలకు వెళ్లి పోవాల్సి ఉంటుంది. కానీ ఒకే ప్రాంతం దొరికితే మాత్రం సర్వసక్తులు, సకల బలాలు పైన పెట్టి గెలుపు సాధిస్తుంది బిజెపి. ఇప్పుడు తెలంగాణను కూడా అలాగే ఫోకస్ చేస్తుంది. జమిలి ఎన్నికలు కనుక లేకపోతే తెలంగాణ ఒక్క రాష్ట్రంపైనే టార్గెట్ చేసి విజయం సాధించాలన్నది బిజెపి వ్యూహంలో తొమ్మిదో పాయింట్.
బిఆర్ఎస్ బీజేపీకి ఎప్పుడో దాసోహం అయిపోయింది. కవిత లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై విడుదలైనప్పుడే ఆ విషయం అందరికీ అర్థమైంది. తెలంగాణలో బి ఆర్ఎస్ నాయకులు బిజెపి నేతలను గాని, కేంద్రాన్ని కానీ, మోడీని గాని ప్రత్యక్షంగా తిట్టరు. ఈ రేస్ స్కామ్ లో కేటీఆర్ నీ అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ అది ఎందుకో ఆగింది. అవసరమైనప్పుడు కేంద్రంలోని ఈడీ ఈ స్కామ్ ని తన చేతిలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. కవిత, కేటీఆర్ కేసుల్లో ఇరుక్కొని కేంద్రానికి చెక్కితే…. తెలంగాణలో బీఆర్ఎస్ ని కంట్రోల్ చేయడం, అదుపులో పెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. హరీష్ రావు లాంటి నాయకులు ఎప్పటినుంచో బీజేపీకి టచ్ లోనే ఉన్నారు. జాగ్రత్తగా తమని తాము రక్షించుకుంటూనే ఉన్నారు. మొత్తం మీద ట్రయాంగిల్ ఫైట్ లో కనుక తాము నష్టపోతాము అనే అనుమానం వస్తే అప్పుడు బిజెపి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుంది. త్రిముఖ పోటీ వలన కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా ఏపీలో ఎలా చేశారో ఇక్కడ కూడా అవసరమైతే బీఆర్ఎస్ ని కలుపుకొని అధికారంలోకి రావాలన్నది బిజెపి ప్లాన్. అయితే ఇది చివరి అస్త్రం మాత్రమే.ఇంత పకడ్బందీగా తెలంగాణ దండయాత్ర వ్యూహాన్ని రూపొందిస్తుంది బిజెపి. తెలంగాణ కన్నా కర్ణాటకకు ముందు ఎన్నికలు వస్తాయి అక్కడ పని పూర్తి చేసుకుని ఇక్కడికి నేరుగా గ్రౌండ్ లో దిగిపోతుంది. పదేళ్లు టిఆర్ఎస్, ఐదేళ్లు కాంగ్రెస్ పాలించాయి కనుక ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వమని తెలంగాణ ప్రజలను అడగబోతోంది బిజెపి.