పవన్ మీద బాడీ షేమింగ్ దుమ్ము దులిపేస్తున్న జనసైనిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా తన కుటుంబంతో కుంభమేళాకు వెళ్లారు. అక్కడ తన భార్య కొడుకుతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేశారు. ఈ ఫొటోలను ఇప్పుడు పవన్ యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా తన కుటుంబంతో కుంభమేళాకు వెళ్లారు. అక్కడ తన భార్య కొడుకుతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేశారు. ఈ ఫొటోలను ఇప్పుడు పవన్ యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. పవన్ ఫిట్‌నెస్ లేకుండా పొట్టతో కనిపించడంతో యాంటీ ప్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ అంతా కట్టగట్టుకుని ఇదే పని అన్నట్టు పవన్‌ను ట్రోల్ చేసే పనిలో పడ్డారు. తమ ఫేవరెట్ హీరో ఫోటోలను పవన్ కుంభమేళాలో దిగిన ఫొటోలను ఫ్రేమ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. 60 ఏళ్లు వచ్చినా చిరంజీవి నాగార్జున ఎలా ఉన్నారు.. నువ్వు ఎలా ఉన్నావు.. అసలు నువ్వు హీరోవేనా.. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నీకేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు కూడా ఈ ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు.
డిప్యుటీ సీఎం అయ్యాక సుఖాలు ఎక్కువైపోయాయని.. అందుకే పవన్ ఇలా ఐపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే.. పవన్ ఫ్యాన్స్ రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారు. నార్మల్‌గానే పవన్ ఫ్యాన్స్ అతని మీద ఈగ కూడా వాలనివ్వరు. అలాంటిది ఈ స్థాయిలో ట్రోలింగ్ చేస్తే ఊరుకుంటారా. ఎవరెవరు పవన్‌ను ట్రోల్ చేస్తున్నారో వాళ్ల హీరోల ఫొటోలను వెతికి మరీ వైరల్ చేస్తున్నారు. ఇదీ మీ స్థాయి అంటూ గుర్తు చేస్తున్నారు. తమ్ముడు సినిమాలోని పవన్ స్టిల్స్‌ను వైరల్ చేస్తున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మార్షల్ ఆర్ట్స్‌ను పరిచయం చేసిందే పవన్ కళ్యాణ్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. పవన్ అప్పట్లో బాడీ బిల్డింగ్ చేసిన ఫొటోలను, మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్ చేసిన ఫొటోలు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ వరుసగా సినిమాలు చేసినప్పుడు ఎక్కడా ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడలేదు.
ఇప్పుడు రాజకీయాల్లో ప్రభుత్వాన్ని నడపడంలో ఆయన బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో ఆయన ఫిట్‌నెస్ మెయిన్‌టేన్ చేయడం కాస్త కస్టమే. ఒకవేళ బిజీ లేకపోయినా.. ఇలాంటి ట్రోలింగ్ మాత్రం తప్పు. పవన్ కళ్యాణ్ సిక్స్ ప్యాక్ చేస్తే ఏపీకి ఉన్న అప్పులు మాఫీ అవుతాయా? పవన్ కళ్యాణ్ ఫిట్‌నెస్ మెయిన్‌టేన్ చేస్తే ఏపీ కొత్త పెట్టుబడులు వస్తాయా? రావు కదా. మరి అలాంటప్పుడు ఆయనను వ్యక్తిగతంగా అలా ట్రోల్ చేయడం ఎంతవరకూ కరెక్ట్. మీకు మీ హీరో అంటే నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు. కానీ పక్కవాళ్లను వ్యక్తిగతంగా ట్రోల్ చేసే హక్కు ఎవరికీ లేదు. పవన్ ప్లేస్‌లో జగన్ ఉన్నా.. ఇలా పర్సనల్ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఒక డిప్యుటీ సీఎంగా, మంత్రిగా పవన్ తన శాఖలకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ఇలా వ్యక్తిగతంగా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.