బోరుగడ్డ నోట బడా లీడర్ల పేర్లు.. వణికిపోతున్న పెద్దోళ్ళు..
వైసీపీ నేతల అండ చూసుకుని రొమ్ము విరిచిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనీల్ కూసాలు కదులుతున్నాయి. అప్పటి ప్రతిపక్ష నేతలను ఉచ్చ నీచాలు మరిచి, మృగంలా చెలరేగిపోయి వినలేని రీతిలో బూతులు మాట్లాడిన అనీల్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
వైసీపీ నేతల అండ చూసుకుని రొమ్ము విరిచిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనీల్ కూసాలు కదులుతున్నాయి. అప్పటి ప్రతిపక్ష నేతలను ఉచ్చ నీచాలు మరిచి, మృగంలా చెలరేగిపోయి వినలేని రీతిలో బూతులు మాట్లాడిన అనీల్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. “చంద్రబాబు నన్నేం పీకుతాడు” అంటూ మాట్లాడిన అనీల్ కు పీకేది ఏంటో చూపించడానికి పోలీసులు రెడీ అయ్యారు. అతనిపై ఇప్పటికే 18 కేసులు నమోదు కాగా గత రెండు రోజుల్లో మరో రెండు కేసులు నమోదు చేసారు పోలీసులు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ కేసు నమోదు చేసారు.
ఇక విచారణలో బోరుగడ్డ అనీల్… ఎవరి సపోర్ట్ తో కాలర్ ఎగరేసాడు అనే దానిపై పోలీసులు కూపీ లాగడం మొదలుపెట్టారు. అనీల్ ఖాతాల్లో కోట్ల రూపాయల డబ్బు ఉన్నట్టుగా గుర్తించారు. బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు బ్యాంకు అధికారులతో కూడా పోలీసులు చర్చలు జరుపుతున్నారు. అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చి చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబూ ప్రకాష్ రూ. 50 లక్షలు ఇవ్వాలని అనిల్ కుమార్ ఫోన్‌లో బెదిరించగా ఆ కేసులో అరెస్ట్ చేసారు.
ఈనెల 17న అమరావతిలో అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు చేసారు. ఇక అతనికి కొందరు వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. బెయిల్ ఒక కేసులో వచ్చినా మరో కేసుని పోలీసులు సిద్దం చేసి ఉంచారు అనీల్ కోసం. ఇక విచారణ సందర్భంగా అనీల్ పోలీసుల కాళ్ళ మీద పడినట్టు వార్తలు వస్తున్నాయి. తాను అప్రూవర్ గా మారతాను అని, వైసీపీ నేతలు తిట్టమని… తన భవిష్యత్తుకు భరోసా ఇస్తేనే మాట్లాడాను అని అనీల్ చెప్పినట్టు సమాచారం.
ఈ సందర్భంగా పోలీసులు అతని ల్యాప్ టాప్, ఐఫోన్ ను కూడా ఓపెన్ చేయించి పలు ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. తన తల్లి సర్జరీ కోసం అనీల్… గుంటూరు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుత టీడీపీ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి బూతులు తిట్టమంటేనే తిట్టాను అని తనకు ఏం తెలియదని అనీల్ చెప్పినట్టు సమాచారం. సెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫారెన్సిక్ ల్యాబ్‌కు కూడా పంపారని సమాచారం. ఇక ఈ కేసులో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. హీరో సాయి ధరమ్ తేజ్ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
అనీల్ తో పాటు అతని అనుచరుడు హరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక కొందరు వ్యాపారులను వైసీపీ నేతల అండతో బెదిరించాడని కూడా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి కూడా ఫిర్యాదులు తీసుకుని కేసులు నమోదు చేసే అవకాశం కనపడుతోంది. గుంటూరు నగరంలో అతని కార్యాలయానికి అతనే నిప్పు పెట్టుకుని హడావుడి చేసాడనే ఆరోపణ కూడా ఉంది. దీనిపై కూడా పోలీసులు ఫోకస్ చేసారు. తాజాగా అనీల్ వ్యవహారంపై ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే అనిల్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హామీ ఇచ్చారు. అనిల్ కుమార్ తనకు తాను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకొంటున్నాడని… దీనిపై అనేక వివాదాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వర్డ్ అకాడమీ(యూకే) పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడన్నారు. 2018లో అనంతపురం టౌన్‌లో ఐఏఎస్ అధికారినని చెప్పి మోసం చేసిన కేసులో అనిల్ జైలు కెళ్లాడని ఆయన వివరించారు.
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అనిల్ రెచ్చిపోవడం మొదలుపెట్టాడని… చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించేవాడన్నారు. ఆయనపై ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. అనిల్‌ను పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందని ఆయన ఆయన వెనుక అదృశ్య శక్తులు ఎవరనైనా ఉన్నారా గుర్తించాల్సిఉందని మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అనీల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.