Botsa Jhansi: హైకోర్టు లాయర్‌గా బొత్స ఝాన్సీ.. మీరు ఇన్‌స్పిరేషన్ మేడమ్‌..

ఇప్పటికీ ఝాన్సీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఎంఏ ఫిలాసఫీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు ఝాన్సీ. ఆ తర్వాత ఫిలాసఫీ, లా కోర్సులో రెండు పీహెచ్‌‌డీలు పూర్తి చేశారు. ఇప్పుడు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యత్వం అందుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 14, 2023 | 05:12 PMLast Updated on: Aug 14, 2023 | 5:12 PM

Botsa Satyanarayanas Wife Botsa Jhansi Turns Lawyer

Botsa Jhansi: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ రాణి హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకున్నారు. ఆమె ఇప్పటికే రెండు పీహెచ్‌డీలు పూర్తి చేశారు. బొత్స ఝాన్సీ గతంలో ఎంపీగా, జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఇప్పటికీ ఝాన్సీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఎంఏ ఫిలాసఫీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు ఝాన్సీ. ఆ తర్వాత ఫిలాసఫీ, లా కోర్సులో రెండు పీహెచ్‌‌డీలు పూర్తి చేశారు.

ఇప్పుడు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యత్వం అందుకున్నారు. ఆమె బార్ మెంబర్‌షిప్ పొందడంతో మంత్రి బొత్స ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆమెను అభినందించారు. న్యాయం కోసం ఎదురు చూసే సామాన్యుని పక్షాన న్యాయస్థానంలో నిలిచేందుకు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషియన్ సభ్యత్వం పొందారు అంటూ అభినందనలు తెలిపారు. ఝాన్సీకి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. తన ఎల్‌ఎల్‌బీ పూర్తైన వెంటనే న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్‌లో ఎన్రోల్ అయ్యే అవకాశమున్నా ఉన్నత విద్య కోసం ఆలస్యంగా లాలో పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు బార్ సభ్యత్వాన్ని అందుకున్నారు. ఝాన్సీ ఓ వైపు రాజకీయాల్లో ఉంటూనే చదువును కొనసాగించారు.

బొత్స ఝాన్సీ ఇప్పటివరకు రెండుసార్లు విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్‌గా, మరోసారి ఎంపీగా పని చేశారు. ఝాన్సీ 2009 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీచేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కూడా గుర్తింపు పొందారు. ఇప్పటికీ రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే చదువును కొనసాగించారు. చదువుకు వయస్సు, రాజకీయాలు అడ్డుకాదని నిరూపించారు.