Brahmanandam: ఎన్నికల్లో బ్రహ్మీ ప్రచారం.. దీనికీ రెమ్యునరేషన్ తీసుకున్నారా?

సమయాన్ని కూడా డబ్బుతో కొలిచే బ్రహ్మానందం.. సుధాకర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ప్రచారం చేశాను అనడం ఆశ్చర్యంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఏ నేతకు ప్రచారం చేయని ఆయన.. ఇప్పుడు కర్ణాటకకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడం సినీ ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యపరుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2023 | 02:40 PMLast Updated on: May 06, 2023 | 2:40 PM

Brahmanandam Campaigns For Bjp In Karnataka He Took Remunaration For It

Brahmanandam: ఎప్పుడూ లేనిది నటుడు బ్రహ్మానందం తొలిసారిగా పొలిటికల్ జెండా కప్పుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేశారు. తన స్నేహితుడు, డాక్టర్ సుధాకర్‌ను గెలిపించాలని కోరారు. రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే బ్రహ్మీ ఇలా ఉన్నట్లుండి ఎన్నికల్లో ప్రచారం చేయడం ప్రేక్షకుల్ని, సినిమా వాళ్లను షాక్‌కు గురి చేస్తోంది. బ్రహ్మానందం నిజంగా తన స్నేహితుడి కోసమే ప్రచారానికి వెళ్లారా? లేక దీనికీ రెమ్యునరేషన్ తీసుకున్నారా?
నటుడిగా బ్రహ్మానందానికి ఎంత గొప్ప పేరున్నా.. ఆయనపై వ్యక్తిగతంగా అనేక విమర్శలున్నాయి. ముఖ్యంగా ఎవరికీ రూపాయి సాయం చేయరని చాలా మంది అంటూ ఉంటారు. పిల్లికి కూడా బిచ్చం వేయడని చెబుతుంటారు. అలాంటి బ్రహ్మానందం కర్ణాటకలోని చిక్కబళ్లాపుర బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ కోసం ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సమయాన్ని కూడా డబ్బుతో కొలిచే బ్రహ్మానందం.. సుధాకర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ప్రచారం చేశాను అనడం ఆశ్చర్యంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఏ నేతకు ప్రచారం చేయని ఆయన.. ఇప్పుడు కర్ణాటకకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడం సినీ ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యపరుస్తుంది. దీనికి కూడా భారీగా రెమ్యూనరేషన్ అందుకుని ఉంటారనే ప్రచారం జరుగుతోంది.
డబ్బుకు విలువ ఇచ్చే బ్రహ్మానందం
బ్రహ్మానందం మనిషికి విలువిస్తారు. అలాగే డబ్బుకూ ప్రాధాన్యం ఇస్తారు. దేనిలెక్క దానిదే. ఆయన ఎవరికీ ఊరికే సాయం చేయరు. ఎవరికైనా ఆపద వచ్చినా బ్రహ్మానందాన్ని పెద్దగా సాయం అడగరు. మరోవైపు రెమ్యునరేషన్ విషయంలోనూ పద్ధతిగా ఉంటారు. తనకు రావాల్సింది ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ఈ విషయం ఇండస్ట్రీ జనాలకు తెలుసు కాబట్టి ఆయన విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. ఆయన చేసే ప్రతిపనికీ ఓ లెక్కుంటుంది. అందుకే సినిమా ఫంక్షన్లలోనూ చాలా తక్కువగా కనిపిస్తారు. ఎంత సన్నిహితులైనా వారికి ఆర్థిక ప్రయోజనం, లాభం ఉంటుంది అంటే.. తన భాగస్వామ్యానికి ఒక లెక్క కడతారు. అలాంటిది ఒక అభ్యర్థికి బ్రహ్మానందం ప్రచారం చేశాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక వ్యక్తి కోసం బ్రహ్మానందం అంత టైం ఇచ్చాడంటే కచ్చితంగా ఏదో ప్రయోజనం అందే ఉంటుంది అని ఆలోచిస్తున్నారు ఆయన సన్నిహితులు.
రెమ్యునరేషన్ తీసుకున్నారా?
నటుడికి తన ప్రతిభతోపాటు టైమే పెట్టుబడి. అంటే ఒక సినిమా కోసం ఒక రోజు కేటాయిస్తే.. ఆ రోజుకు సంబంధించి నటులకు పారితోషికం దక్కాల్సిందే. సినిమాలో ఒక్క రోజు నటించినా రెమ్యునరేషన్ తీసుకోవాల్సిందే. అలాంటిది బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం కోసం టైం ఇచ్చాడంటే దీనికి కూడా తను ఎంతోకొంత తీసుకునే ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులోనూ బ్రహ్మానందం రాజకీయాలకు చాలా దూరం. గతంలో తనకు కావాల్సిన వాళ్లు ఎందరో ఎన్నికల్లో పోటీ చేసినా ఆయన వాటికి దూరంగానే ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను ప్రచారానికి ఆహ్వానించినా వెళ్లలేదు. సడెన్‌గా ఇప్పుడు కర్ణాటకలో బ్రహ్మానందం ప్రచారానికి వెళ్లడం గురించే చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల నట జీవితంలో బ్రహ్మానందం ఇలా ప్రచారం చేయడం ఇదే మొదటిసారేమో. ఎప్పుడూ లేనిది ఆయన ఇలా వెళ్లేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎంతగా తన స్నేహితుడి కోసమే ప్రచారం చేశానని బ్రహ్మీ చెప్పినా.. ఏదో పారితోషికం అంది ఉంటుందిలే అనుకుంటున్నారంతా. ఏదైమైనా బ్రహ్మానందాన్ని ఎన్నికల ప్రచారంలో చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.