బ్రేకింగ్: కేటిఆర్ పై మరో కేసు..!
మాజీ మంత్రి కేటిఆర్ ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేసారు బంజారా హిల్స్ పోలీసులు.

మాజీ మంత్రి కేటిఆర్ ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేసారు బంజారా హిల్స్ పోలీసులు. నిన్న విచారణ తరువాత ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటిఆర్ పోలీసుల పై దుర్భాషలాడి, న్యూసెన్స్ చేసి , ట్రాఫిక్ సమస్యకు కారణమయ్యారు అనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేసారు. ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ వరకు అనుమతి లేకుండా ర్యాలీ చేసారు కేటిఆర్. ఆయనతో పాటుగా మరో ఆరుగురిపై కూడా కేసు నమోదు చేసారు బంజారా హిల్స్ పోలీసులు.