బ్రేకింగ్: ఏపీ రాజ్యసభ షెడ్యూల్ వచ్చేసింది
ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 20 న పోలింగ్ జరగనుంది. ఇక ఈ స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఇంకా కూటమి నుంచి క్లారిటీ లేదు.
రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఒక స్థానం కేటాయించే అవకాశం కనపడుతోంది. జనసేన నుంచి… నాగబాబును రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక టీడీపీ నుంచి ఎవరిని పంపిస్తారు అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.