బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ పై కేసు…?
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది.

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పిల్ దాఖలు అయింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. తిరుపతి లడ్డు విషయం లో అనుచిత వ్యాఖ్యలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని… ఈ మేరకు తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు గృహమంత్రిత్వ శాఖను ఆదేశించావలసిందిగా పిటీషన్ దాఖలు చేసారు న్యాయవాది ఇమ్మనేని రామారావు.
పవన్ కళ్యాణ్ తన అనుచిత సరళని కొనసాగించకుండా గాగ్ ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా పిటిషన్ దాఖలు చేసారు. భోజన విరామం తరువాత విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారంపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష కూడా చేసి అనంతరం తిరుమల వెళ్ళారు.