బ్రేకింగ్: దువ్వాడపై కేసు నమోదు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పోలీస్ స్టేషన్లో నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసైనికుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు పోలీసులు.

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పోలీస్ స్టేషన్లో నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసైనికుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు పోలీసులు. గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ దూషించి,అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసారు. గతంలో టెక్కలిలోని జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేయించిన అప్పట్లో పోలిసులు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా జనసైనికులు ఆరోపించారు.
విచారణ జరిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ హాట్ టాపిక్ అవుతున్నారు. దివ్వెల మాదురితో ఆయన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఈ క్రమంలోనే ఆయనను టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ పదవి నుంచి కూడా తప్పించారు జగన్.