బ్రేకింగ్: చంద్రబాబుకు తప్పిన రైలు ప్రమాదం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పెను ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్‌పై సీఎం చంద్రబాబుకు రైలు కొన్ని అడుగుల దూరంలో నిలిచింది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పెను ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్‌పై సీఎం చంద్రబాబుకు రైలు కొన్ని అడుగుల దూరంలో నిలిచింది. బుడమేరు వాగుని పరిశీలించేందుకు చంద్రబాబు నాయుడు నేడు బల్లకట్టుపై వెళ్ళారు. రైల్వే ట్రాక్ వద్ద చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్న సమయంలో అదే సమయంలో ట్రైన్ ట్రాక్ పైకి వచ్చింది. ట్రైన్‌ను చూసి వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ పైకి చంద్రబాబు ఎక్కారు. ఇక వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు అప్రమత్తమై లైన్‌మెన్‌ను తీసుకువచ్చి ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ ఆగింది. చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో నిలిచిన రైలు నిలిచింది. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.