బ్రేకింగ్: కార్పోరేషన్ పదవులు, ఏ పార్టీకి ఎన్ని…?
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్పోరేషన్ చైర్మన్ పదవుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కీలక పదవులు మినహా ఇతర పదవుల జాబితా విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్పోరేషన్ చైర్మన్ పదవుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కీలక పదవులు మినహా ఇతర పదవుల జాబితా విడుదల చేసింది. వివిధ కార్పోరేషన్ లకు చైర్మన్ లను నియమించింది. మొత్తం 20 కార్పోరేషన్ల చైర్మన్ల పదవులను భర్తీ చేసింది. గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి న్యాయం చేస్తూ జాబితాను విడుదల చేసారు.
టీడీపీ 16 జనసేన 3, బిజెపికి 1 పదవి దక్కాయి. ఆర్టీసీ చైర్మన్ గా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను ఎంపిక చేసారు. దేవినేని ఉమాకు ఆ పదవి వరిస్తుందని అందరూ భావించారు. ఏపీ కన్జ్యూమర్ ప్రొడక్షన్ కౌన్సిల్ కు చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాతను ఎంపిక చేసారు. మంతెన రామరాజు, పిల్లి మాణిక్యాల రావు, లంకా దినకర్, దామచర్ల సత్య వంటి వారికి పదవులు దక్కాయి.