బ్రేకింగ్: మహారాష్ట్ర సిఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
బిజెపి శాసన సభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పది రోజుల సస్పెన్స్ తర్వాత సీఎం ఎంపిక కొలిక్కి వచ్చింది. ఎన్నికల్లో మహాయుతి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన ఎన్సీపీ, శివసేన, బీజేపి... సీఎం పీఠం విషయంలో పట్టుబట్టాయి.
బిజెపి శాసన సభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పది రోజుల సస్పెన్స్ తర్వాత సీఎం ఎంపిక కొలిక్కి వచ్చింది. ఎన్నికల్లో మహాయుతి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన ఎన్సీపీ, శివసేన, బీజేపి… సీఎం పీఠం విషయంలో పట్టుబట్టాయి. అజిత్ పవార్ సైలెంట్ గానే ఉన్నా… మిగతా పక్షాలు క్లారిటీకి రాలేదు. చివరకు బీజేపికి సీఎం పదవి ఇచ్చేందుకు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ అంగీకరించారు.
బిజెపి పెద్దలతో సమావేశం తర్వాత కూల్ అయిన ఏక్నాథ్ షిండే… పలు డిమాండ్ లను బిజెపి పెద్దల ముందు ఉంచారు. షిండే కుమారుడుకి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు ఆజాద్ మైదానంలో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు.