బ్రేకింగ్; కేటిఆర్ కు ఈడీ ఉచ్చు
తెలంగాణా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన నేపధ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి.
తెలంగాణా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన నేపధ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. కేటిఆర్ పై నమోదు అయిన కేసులో రంగంలోకి దిగింది ఈడీ. కేటిఆర్ పై నమోదు అయిన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటుగా హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన వివరాలు కావాలని ఈడీ కోరింది.
ఈ మేరకు తెలంగాణా ఏసీబీ అధికారులకు లేఖ రాసిన దర్యాప్తు సంస్థ… దాన కిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని లేఖలో పేర్కొంది. ట్రాన్సాక్షన్ జరిగిన తేదీలు కూడా చెప్పాలని కోరింది. ఇక కేటిఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో ఏ పరిణామాలు ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.