బ్రేకింగ్: సీఎంతో రాజీకి సినిమా పెద్దలు
త్వరలో సిఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దలు భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రముఖ నిర్మాత, ఫిలిం డెవెలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు మధ్యవర్తిత్వం చేయనున్నారు.

త్వరలో సిఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దలు భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రముఖ నిర్మాత, ఫిలిం డెవెలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు మధ్యవర్తిత్వం చేయనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న దిల్ రాజు… గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
ఇటీవల సంధ్య థియేటర్ ఘటన వ్యవహారంతో తెలంగాణా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ నేపధ్యంలో… బెనిఫిట్ షోలకు, సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చేది లేదని రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేసారు. త్వరలో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్న నేపధ్యంలో రాజీ మార్గాలను అన్వేషిస్తోంది టాలీవుడ్. భేటీ ఎప్పుడు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.