బ్రేకింగ్: జత్వాని కేసుపై హైకోర్ట్ కీలక ఆదేశాలు
ముంబై నటి జత్వాని కేసులో పోలీస్ అధికారులు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్ లో విచారణ జరిగింది. కేసును తాజాగా సిఐడి కి అప్పగించారని , కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు.

ముంబై నటి జత్వాని కేసులో పోలీస్ అధికారులు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్ లో విచారణ జరిగింది. కేసును తాజాగా సిఐడి కి అప్పగించారని , కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. కేసు డిస్పోజ్ అయ్యే వరకు పోలీస్ అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలయ్యే విధంగా చూడాలని పిటిషనర్ లు తరపున న్యాయవాదులు అభ్యర్ధించారు.
ఈ అంశాలను న్యాయస్థానం నోట్ చేసుకుంది. కేసు విచారణ ను ఈ నెల 23 కు వాయిదా వేసింది కోర్ట్. అప్పటి వరకు ఈ కేసులో ఎటువంటి ముందస్తు చర్యలు వద్దని ఏపీ హైకోర్ట్ స్పష్టం చేసింది. ఓ కీలక నేతను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.