బ్రేకింగ్: తెలంగాణాకు కొత్త మంత్రులు
తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సీఎం ఢిల్లీ పర్యట నేపథ్యంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ చర్చల్లోకి వచ్చింది.

తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సీఎం ఢిల్లీ పర్యట నేపథ్యంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ చర్చల్లోకి వచ్చింది. నేడు హోం శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశం అనంతరం కాంగ్రెస్ పెద్దలను కలవనున్న సీఎం… మంత్రి వర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉంది. ఆరుగురు మంత్రులకు తెలంగాణా కేబినేట్ లో అవకాశం ఉంది. దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.
హర్యానా ఎన్నికలు కూడా ముగియడంతో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. విస్తరణతో పాటు శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. కార్పోరేషన్ల భర్తీపై కూడా క్లారిటీ రానుంది.