బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు ప్రత్యేక భవనం వాడడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేడు ఓ లేఖ రాశారు పవన్.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు ప్రత్యేక భవనం వాడడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేడు ఓ లేఖ రాశారు పవన్. మంగళగిరిలోని తన నివాసాన్ని ఇకపై క్యాంపు కార్యాలయంగా వాడుకుంటా అని… కావున విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని, ఫర్నిచర్, ఇతర సామగ్రి సహా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు.
విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పట్ల చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు పవన్ కళ్యాణ్. తాను ఇక నుంచి మంగళగిరిలోని నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నాను కాబట్టి… విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నానని తన లేఖలో పవన్ పేర్కొన్నారు.