బ్రేకింగ్: అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రియాక్షన్
పార్లమెంట్ వద్ద మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదన్న ఆయన చట్టం ముందు అందరూ సమానులే అని పేర్కొన్నారు.
పార్లమెంట్ వద్ద మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదన్న ఆయన చట్టం ముందు అందరూ సమానులే అని పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేసారు.
మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని క్యాబినెట్ విస్తరణ పై చర్చ లేదన్నారు. ఓవైపు సీరియస్ గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. క్యాబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్యనేతలతో చర్చలు జరగాలన్నారు. కాగా గాంధీ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు పూర్తి కావడంతో అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్ట్ కు తరలించనున్నారు.