బ్రేకింగ్: రాజకీయాలకు రోజా గుడ్ బై..? అధిష్టానానికి సమాచారం..!
వైసిపి కీలక నేత మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న రోజా..

వైసిపి కీలక నేత మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న రోజా.. ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పే ఆలోచనలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం పార్టీలో రోజాకు ప్రాధాన్యత తగ్గుతుంది. త్వరలో నగిరి నియోజకవర్గంలో గాలి జగదీష్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. త్వరలో పార్టీలో చేరుతున్న గాలి జగదీష్ ఇప్పటికే అధిష్టానం వద్ద ఈ విషయంలో హామీ కూడా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వైసిపి ఏర్పాటైన దగ్గర నుంచి రోజా జగన్ వెంట నడిచారు. రాజకీయంగా జగన్ ఎత్తు పల్లాల్లో ఉన్న సమయంలో రోజా ఆయన వెంట ఉన్నారు. అయితే ఇప్పుడు రోజా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్గ పోరు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రోజా విషయంలో సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే రోజాకు చెక్ పెట్టేందుకు గాలి జగదీష్ ను పార్టీలోకి తీసుకురావడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో తన మాట వినే నాయకులను, తన కొడుకు భవిష్యత్తుకు ఇబ్బంది లేని నాయకులను పార్టీలోకి తీసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారు.
ఇందుకే ఆయన ఆర్కే రోజాను పక్కన పెట్టినట్లు సమాచారం. అటు అధిష్టానం కూడా పెద్దిరెడ్డికి గట్టిగానే ప్రాధాన్యతిస్తుంది. దీనితో పెద్దిరెడ్డి మాట వినే గాలి జగదీష్ ను వైయస్ జగన్.. పార్టీలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్కే రోజా రాజకీయాల్లో ఉండటం ఉపయోగం లేదని డిసైడ్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఆమె రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జగన్ తో… రోజా అప్పట్లో అత్యంత సన్నిహితంగా ఉండేవారు.
జగన్ ను ఎవరైనా విమర్శిస్తే ఆమె మీడియా ముందుకు వచ్చి ఎవరినైనా సరే తీవ్రస్థాయిలో విమర్శించే వారు. ఇప్పుడు మాత్రం రోజా దాదాపుగా సైలెంట్ అయిపోయారు. ఓవైపు కేసుల భయం, మరోవైపు సొంత జిల్లాలో వర్గ పోరు రోజాను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఆమె సైలెంట్ గా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పార్టీ అధిష్టానం కూడా తనకు ప్రాధాన్యత తగ్గిస్తున్న.. నేపథ్యంలో రాజకీయాల్లో ఉండకూడదు అని రోజా డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే ఆమె సినిమాల వైపు కూడా ఆసక్తి చూపిస్తున్నారని.. ఈమధ్య వార్తలు వచ్చాయి.
ఇప్పటికే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక ఆర్కే రోజా కూడా గుడ్ బై చెప్తే అది సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజా.. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించారు. ఇక 2019 తర్వాత ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. అదే సమయంలో సొంత జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక 2024 ఎన్నికల్లో ఆమె ఓటమికి వైసీపీ నాయకుల కారణమనే అభిప్రాయం కూడా ఉంది.