బ్రేకింగ్: జగన్ కు షాక్, ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. నిన్న పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పగా నేడు మరో ఇద్దరు ఆ పార్టీ పదవులకు, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసారు.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. నిన్న పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పగా నేడు మరో ఇద్దరు ఆ పార్టీ పదవులకు, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా సమర్పించారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి మండలి చైర్మన్ కు తమ రాజీనామా లేఖలు సమర్పించారు.
నిన్న వైసీపీ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దమయ్యారు. త్వరలోనే వైసీపీకి మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక శాసన మండలిలో వైసీపీకి బలం తగ్గే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.