బ్రేకింగ్: వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన కోర్ట్

వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో హైకోర్ట్ వైసీపీ నేతలకు షాక్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో ముందస్తు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2024 | 11:56 AMLast Updated on: Sep 04, 2024 | 11:56 AM

Breaking The Court Shocked The Ycp Leaders

వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో హైకోర్ట్ వైసీపీ నేతలకు షాక్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో ముందస్తు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు అయింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో వైసీపీ నేతలను అరెస్ట్ చేసే అవకాశం కనపడుతోంది.

దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురికి బెయిల్ తిరస్కరించారు. అలాగే మరో కేసు… చంద్రబాబు నివాసం పై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ నిరాకరించింది కోర్ట్. అయితే బెయిల్ నిరాకరించిన వాళ్ళపై ఏ విధమైన చర్యలను రెండు వారాల వరకు తీసుకోకుండా అడ్డుకోవాలని హైకోర్ట్ ను వైసీపీ కోరగా దీనిపై మధ్యాహ్నం పరిశీలిస్తామని హైకోర్ట్ సమాధానం ఇచ్చింది.