బ్రేకింగ్: ఏపీలో 26 జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులు వీరే

ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమించింది ఏపీ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. విజయనగరం జిల్లాకు హోం మంత్రి అనిత, శ్రీకాకుళం జిల్లాకు కొండపల్లి శ్రీనివాస్ ను నియమించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 15, 2024 | 01:15 PMLast Updated on: Oct 15, 2024 | 1:15 PM

Breaking These Are The Ministers In Charge Of 26 Districts In Ap

ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమించింది ఏపీ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. విజయనగరం జిల్లాకు హోం మంత్రి అనిత, శ్రీకాకుళం జిల్లాకు కొండపల్లి శ్రీనివాస్ ను నియమించారు. అలాగే పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాలకు సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడుకి బాధ్యతలు అప్పగించారు. విశాఖ జిల్లాకు డోలా బాలవీరాంజనేయస్వామిని అల్లూరి జిల్లాకు సంధ్యారాణిని నియమించారు.

ఇక అనకాపల్లి జిల్లాకు గానూ కొల్లు రవీంద్ర, కాకినాడ జిల్లాకు నారాయణకు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. కర్నూలు, తూ.గో జిల్లాకు జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడుకి బాధ్యతలు అప్పగించారు. పల్నాడు, ప.గో జిల్లాలకు గొట్టిపాటి రవికుమార్ కి బాధ్యతలు అప్పగించగా ఎన్టీఆర్ జిల్లాకు సత్యకుమార్ కు కృష్ణా జిల్లాకు వాసంశెట్టి సుభాష్‌ కు బాధ్యతలు అప్పగించారు.

ఇక గుంటూరుకు కందుల దుర్గేష్‌, బాపట్ల జిల్లాకు కోలుసు పార్థసారథికి బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లాకు సీనియర్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరుకు ఫరూఖ్‌ కి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. నంద్యాలకు గానూ పయ్యావుల కేశవ్, అనంతపురం జిల్లాకు టీజీ భరత్ కు బాధ్యతలు కేటాయించారు. శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలకు అనగాని సత్యప్రసాద్ కడప జిల్లాకు సవిత, అన్నమయ్య జిల్లాకు బీసీ జనార్ధన్‌రెడ్డి, ఏలూరుకు నాదెండ్ల మనోహర్, చిత్తూరుకు రాంప్రసాద్‌రెడ్డికి బాధ్యతలు కేటాయించారు.