BRS-BJP: రేవంత్ నెత్తిన బాంబ్.. ఆ కేసుతో రేవంత్‌కు షాక్ ! బీజేపీ, బీఆర్ఎస్ మాస్టర్ స్ట్రోక్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఒకేసారి టార్గెట్ చేయబోతున్నారా..? లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ వేరే లెవల్లో ఉంటుందా..? ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఇదే హాట్ టాపిగ్గా నడుస్తోంది.
BRS-BJP: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటుంటారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాయా..? తమ ఇద్దరికీ శత్రువైన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఒకేసారి టార్గెట్ చేయబోతున్నారా..? లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ వేరే లెవల్లో ఉంటుందా..? ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఇదే హాట్ టాపిగ్గా నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారతాయనే టాక్ గత కొన్ని రోజులుగా బలంగా నడుస్తోంది. ఒకప్పుడు ఉప్పు, నిప్పులాగా ఉన్న బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటైతే తెలంగాణలో రాజకీయం మొత్తం ఉల్టా పల్టా అవుతుందని అంటున్నారు.
KCR-BJP: ఒప్పుకోండి ప్లీజ్ ! కేసీఆర్‌కి జైలు తప్పదా.. ఢిల్లీలో పైరవీలు అందుకేనా..?
రెండు పార్టీల నేతలు కలసి.. కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డిని ఉమ్మడిగా టార్గెట్ చేసినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి సీటు కిందకు నీళ్లు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఊహించని పరిణామాలు వస్తాయని బీఆర్ఎస్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మా బాసే అంటూ ఆ పార్టీ నేతలు ధీమాగా చెప్పుకోవడానికి కారణం ఇదే అంటున్నారు. తెలంగాణలో BRSకు 39 స్థానాల బలం ఉంది. బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. ఈ రెండూ కలిపితే 47. దీనికి కాంగ్రెస్ నుంచి మరో 14 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి సర్కార్ పడిపోవడం ఖాయం. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవడం కూడా గ్యారంటీ. కానీ ఇది నిజంగా జరుగుతుందా..? కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా..? ఆ పార్టీ నుంచి 14 మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకురావడం కుదురుతుందా అంటే.. ఎందుకు కుదరదు. చాలా రాష్ట్రాల్లో ఇదే ఫార్ములాను బీజేపీ ప్రయోగించింది. తెలంగాణ మాత్రం అందుకు మినహాయింపు అవుతుందా అని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. అందుకోసం డబ్బులు, ఐటీ, ఈడీ కేసులు.. ఇలా ఏదో ఒక అస్త్రాన్ని వాడుతుందన్న ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తూనే ఉన్నాయి. అందుకే లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలోనూ ఇదే ఫార్ములాకు ఛాన్స్ ఉందంటున్నారు.
కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఎలాగూ వీక్ అవుతుంది. ఇప్పటికే ఇండియా కూటమిలో చీలికలు, పీలికలు కొనసాగుతున్నాయి. రేపు ఎన్నికల తర్వాత.. ఓటమికి కాంగ్రెస్సే కారణమని చెప్పి.. పెద్ద బండ వేసి చాలా ప్రాంతీయ పార్టీలు బీజేపీ వైపు టర్న్ అయ్యే అవకాశముంది. అప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. అందులో భాగంగా దక్షిణాదిన కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ పొలిటికల్ ఈక్వేషన్ మారతాయని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెడకు ఓటుకు నోటు కేసు కత్తి వేలాడుతోంది. ఆయన్ని పదవి నుంచి దించడానికి ఈ కేసు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఒకవేళ అది సక్సెస్ కాకపోతే.. కాంగ్రెస్‌ని చీల్చి 14 మంది ఎమ్మెల్యేలను లాగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది మరో ప్లాన్‌గా చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ రెండు ప్లాన్స్‌లో ఏదో ఒకటి కచ్చితంగా అమలు చేస్తారన్న టాక్ నడుస్తోంది. అంతకంటే ముందు బీజేపీ – బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం మీద దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.