BRS Candle Rally : కాసేపట్లో బీఆర్ఎస్ క్యాండిల్ ర్యాలీ… అమర వీర స్థూపం నుంచి అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించేందుకు బీఆర్ఎస్ (BRS) సిద్ధమైంది.

BRS Candle Rally in a while... Candle Rally from Amari Veera Stoop to Amara Jyoti
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించేందుకు బీఆర్ఎస్ (BRS) సిద్ధమైంది. మరి కాసేపట్లో హైదరాబాద్ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి సచివాలయం ముందున్న అమరజ్యోతి వరకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది.
నేటి నుంచి 3 రోజులపాటు వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలతో నేడు గన్ పార్క్ (Gun Park) అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) సచివాలయం (Secretariat) ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ (Candle rally) నిర్వహించనున్నారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జంటనగరాల పార్టీ శ్రేణులతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. రేపు తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో జరిగే కార్యక్రమానికి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో సాధించిన ప్రగతి ఇతర అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు సమాచారం.