KCR SKETCH : కేసీఆర్ భలే స్కెచ్ ..! వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు ప్లాన్
వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండటంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీవ్రంగానే ఉంటుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆ వ్యతిరేక ఓట్లను మాగ్జిమమ్ చీల్చేందుకు సరికొత్త ప్లాన్ వేశారు. తాము వీక్ గా ఉన్న నియోజకవర్గాల్లోనూ గెలిచేలాగా ఆలోచన చేస్తున్నారు.
వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండటంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీవ్రంగానే ఉంటుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆ వ్యతిరేక ఓట్లను మాగ్జిమమ్ చీల్చేందుకు సరికొత్త ప్లాన్ వేశారు. తాము వీక్ గా ఉన్న నియోజకవర్గాల్లోనూ గెలిచేలాగా ఆలోచన చేస్తున్నారు.
రాష్ట్రంలో ఒక్క బీఆర్ఎస్ తప్ప దాదాపు అన్ని పార్టీల్లోనూ రెబల్స్ బెడద తప్పడం లేదు. BRS లో కూడా ఉన్నా.. అదేమంతా ఎఫెక్ట్ చూపించదు. కానీ కాంగ్రెస్, బీజేపీలో మాత్రం.. టిక్కెట్లు రాని వాళ్ళు, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఇప్పుడు టికెట్ రాక మోసపోయామని అనుకునేవాళ్ళు చాలా మందే ఉన్నారు. వీళ్లలో కొందరు ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా అంటే రెబల్స్ గా బరిలోకి దిగారు. అందుకే ఈసారి ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. అయితే ఈ రెబల్స్ లో ఆయా నియోజకవర్గాల్లో కొద్దో గొప్పో ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉంటే.. ఇది పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీ గెలుపు ఓటములపై ప్రభావం చూపబోతోంది. వీళ్ళని ఈనెల 15లోపు బుజ్జగించి పోటీ నుంచి తప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి.
MLA Guvwala Balaraju : నా భర్తను కాంగ్రెస్ వాళ్లు చంపేస్తారు.. ఎమ్మెల్యే భార్య కన్నీళ్లు..
కానీ సరిగ్గా BRS చీఫ్ ఇక్కడే చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెబల్స్ తో పాటు వివిధ నియోజకవర్గాల్లో పలుకుబడి కలిగిన ఇండిపెండెంట్ అభ్యర్థులకు అండగా నిలవాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళంతా అలాగే పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందనేది కేసీఆర్ ప్లాన్ (KCR SKETCH) గా కనిపిస్తోంది. అందుకోసం అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థుల ఖర్చంతా తామే భరించాలని కూడా గులాబీ బాస్ డిసైడ్ అయ్యారు. పార్టీల బుజ్జగింపులకు లొంగవద్దు.. మీరు పోటీలోనే ఉండాలి.. మీ ఎన్నికల ఖర్చులు మేమే భరిస్తామని BRS కీలకనేతలు వాళ్ళకు ఫోన్లు చేస్తున్నట్టు సమాచారం.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత చీలితే.. తమ అభ్యర్థులు విజయం సాధించడం అంత ఈజీ అవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే వీలైనంత ఎక్కువ మంది ఇండిపెండెంట్స్, కాంగ్రెస్, బీజేపీ రెబల్స్ పోటీలో ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఓ షరతు కూడా ఉంది. ఇలా ఇండిపెండెంట్స్ గా బరిలోకి దిగిన వారికి స్థానికంగా ఎంత బలం ఉంది.. ఏ మేరకు ఓట్లు వచ్చే అవకాశం ఉందనేది ముందుగానే ఆరా తీస్తున్నారు BRS లీడర్లు. ఆ నియోజకవర్గంలో వీలైనన్ని ఎక్కువ ఓట్లను చీల్చే అభ్యర్థులకే ప్రియార్టీ ఇస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ ఉండటంతో.. మొదటి ప్రాధాన్యత ఆ పార్టీలోని రెబల్స్ కే ఇస్తున్నారు. పోటీలో ఉంటామని మాట ఇస్తే చాలు.. వెంటనే కొంత క్యాష్ కూడా ఆ రెబల్ అభ్యర్థికి ఇచ్చిపంపుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మాగ్జిమమ్ చీల్చేందుకు BRS చేస్తున్న ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది డిసెంబర్ 3న తేలుతుంది.