BRS: ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదేమో!
సిట్టింగులతో జంబో లిస్టుని ప్రకటించిన కేసీఆర్.. బీఫామ్ సమయం వరకు కొందరికి షాక్ ఇచ్చారు. అవసరాన్ని బట్టి మార్పులు, చేర్పులు చేశారు. అలా చేయడంతో 12స్థానాల్లో బీఆర్ఎస్‌కు విజయం దక్కింది. అంతకు ముందున్న ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుని కాదని.. కోవా లక్ష్మికి టికెట్ ఇచ్చారు.
BRS: లాస్ట్ మినిట్‌లో చేసిన మార్పులు కొన్ని చోట్ల బీఆర్ఎస్‌కు కలిసి వచ్చాయ్. అలా ఒక డజన్ స్థానాల్లో గెలిచింది. విమర్శలు, ఆరోపణలు వచ్చినా కొందరిని మార్చకపోవడం మాత్రం ఆ పార్టీకి మైనస్ అయింది. అరడజన్ పైగా సీట్లు ఇలా బీఆర్ఎస్ కోల్పోయింది. సిట్టింగులతో జంబో లిస్టుని ప్రకటించిన కేసీఆర్.. బీఫామ్ సమయం వరకు కొందరికి షాక్ ఇచ్చారు. అవసరాన్ని బట్టి మార్పులు, చేర్పులు చేశారు. అలా చేయడంతో 12స్థానాల్లో బీఆర్ఎస్‌కు విజయం దక్కింది. అంతకు ముందున్న ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుని కాదని.. కోవా లక్ష్మికి టికెట్ ఇచ్చారు. అనుకున్నట్టే ఆమె కాంగ్రెస్ అభ్యర్ధి అజ్మీరా శ్యాం నాయక్‌పై గెలిచారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుని పక్కన పెట్టి అనిల్ జాదవ్‌కు బీఫాం ఇచ్చారు కేసీఆర్.
KCR DEFEAT: 40 ఏళ్ల తర్వాత ఓటమి.. జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్..
దాంతో బాపూరావు అలిగి బీజేపీలో చేరారు. ఇక్కడ అనిల్ జాదవ్ 22వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. కోరుట్ల సెగ్మెంటులో వారసుడి కోటాలో టికెట్ దక్కించుకున్న కల్వకుంట్ల సంజయ్.. బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్‌పై పదివేలకు పైగా మెజారిటీతో గెలిచారు. నర్సాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పక్కన పెట్టి.. ఆయన స్థానంలో సునీత లక్ష్మారెడ్డికి బీ ఫాం ఇచ్చారు కేసీఆర్. మదన్ రెడ్డికి మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా ఉన్న సునీత లక్ష్మారెడ్డి.. ఈసారి ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి ఆవుల రాజిరెడ్డిపై 8వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. నర్సాపూర్‌లో సర్దుబాటులో భాగంగా మదన్‌రెడ్డికి మెదక్ ఎంపీ సీటుని ఇస్తామని ప్రామిస్ చేశారు. అందులో భాగంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాకకు షిఫ్ట్ అయి.. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుపై 53వేల భారీ మెజారిటీతో గెలిచారు. ఉప్పల్ స్థానం కూడా నాన్ సిట్టింగే..! అంతకుముందు గెలిచిన భేతి సుభాష్ రెడ్డిని కాదని బండారు లక్ష్మారెడ్డికి బీ ఫాం ఇచ్చారు.
Congress Cabinet: కేబినెట్ కూర్పు.. కాంగ్రెస్‌కి పెద్ద ఛాలెంజ్..
కేసీఆర్ ఊహించినట్టుగానే ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి పరమేశ్వర్ రెడ్డిపై 49వేల మెజారిటీతో నెగ్గారు. అలంపూర్ స్థానాన్ని చివరి నిమిషంలో మార్చడంతో.. ఆ సీటు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లింది. జనగామ సిట్టింగుని మార్చడానికి కేసీఆర్ భారీ కసరత్తే చేయాల్సి వచ్చింది! ముత్తిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి, పల్లాకు లైన్ క్లియర్ చేసి, మొత్తానికి జనగామని అకౌంట్లో వేసుకున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ కూడా జనగామ లాంటి క్రిటికల్, టిపికల్ సీటు. ఇక్కడ కూడా సిట్టింగుని మార్చడానికి గులాబీ పార్టీ బాగానే వర్కవుట్ చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యని కాదని, కడియం శ్రీహరికి బీ ఫాం ఇచ్చారు. రాజయ్య వర్గం నుంచి ఎదురుగాలి వీచినా, కాంగ్రెస్ అభ్యర్ధిపై 7వేల మెజారిటీతో గెలిచారు కడియం శ్రీహరి. కొందరు అభ్యర్థులపై తీవ్ర ఆరోపణలు వచ్చినా.. రేసు నుంచి తప్పించలేదు కేసీఆర్. ఆ స్థానాల్లో సిట్టింగ్‌లపై వ్యతిరేకత ఉందని తెలిసినా.. వారిని మార్చేందుకు ఇష్టపడలేదు. దుర్గం చిన్నయ్య, కోదాడ మల్లయ్య, పువ్వాడ అజయ్, జీవన్‌రెడ్డిపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
దుర్గం చిన్నయ్య వ్యవహార శైలిపై పెద్ద రచ్చే జరిగింది. కానీ కేసీఆర్ ఇలాంటి వారి విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇదే బీఆర్ఎస్‌కు మైనస్ గా మారిందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. కొందరు మంత్రుల విషయంలోనూ లైట్ తీసుకోవడం నష్టం చేసిందనుకుంటున్నారు. ఈ సీట్లలో కొత్త అభ్యర్థుల్ని పెడితే బీఆర్ఎస్ గెలుపునకు అవకాశం ఉండేదని చర్చించుకుంటున్నారు. మొత్తానికి కొన్ని మార్పులు బీఆర్ఎస్‌కు కలిసి వస్తే.. మరికొన్ని సీట్లలో అభ్యర్థుల్ని మార్చకపోవడం మైనస్ అయింది.