BRS POLL MANAGEMENT: ఒక్క ఓటూ మిస్ అవ్వొద్దు ! మునుగోడు తరహాలో బీఆర్ఎస్ పక్కా ప్లాన్!!
మునుగోడు అసెంబ్లీ స్థానంలో విజయానికి ఫాలో అయిన విధానాన్నే.. ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే గ్రౌండ్ లెవల్లో నేతలు, కార్యకర్తలు పకడ్బందీగా ఉండాలి.
BRS POLL MANAGEMENT: ‘పక్కా ప్లాన్‌తో ముందుకెళ్ళాలి.. నియోజకవర్గంలో ఏ ఒక్క ఓటూ మిస్ అవ్వకూడదు. ఆపరేషన్ మునుగోడు తరహాలో ప్రతి నియోజకవర్గంలో ప్లాన్ చేయండి’.. ఇది బీఆర్ఎస్ అభ్యర్థులకు, ఇంఛార్జులకు ఆ పార్టీ హైకమాండ్ దిశా నిర్దేశం. చాలా స్థానాల్లో కాంగ్రెస్ వేవ్ వీస్తుండటంతో.. ఆ పార్టీని కట్టడి చేయడానికి పకడ్బందీగా పోల్ మేనేజ్‌మెంట్ చేస్తోంది BRS. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల కదలికలపై నిఘా పెట్టాలని కూడా చెబుతోంది. మునుగోడు అసెంబ్లీ స్థానంలో విజయానికి ఫాలో అయిన విధానాన్నే.. ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే గ్రౌండ్ లెవల్లో నేతలు, కార్యకర్తలు పకడ్బందీగా ఉండాలి.
అందుకే ప్రత్యర్థి అభ్యర్థులను ఓ కంట కనిపెడుతూ వాళ్ళకి చెక్ పెట్టేలా ప్లాన్ చేస్తోంది. ప్రత్యర్థి అనుచరులు, కింది స్థాయి కేడర్ కదలికలపై నిఘా వేసి.. అనుమానం వస్తే వెంటనే ఎలక్షన్ టీమ్‌కు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రచారం ముగిసిన తర్వాత రెండు రోజుల్లో ఈ ప్లాన్ అమలు చేయబోతోంది బీఆర్ఎస్. దాంతో ప్రత్యర్థి పార్టీలు డబ్బులు, మద్యం పంచకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతోంది బీఆర్ఎస్. ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ముందేసుకొని.. వాళ్ళని ఐదు వర్గాలుగా విభజించారు. తమకు అనుకూలంగా పడే ఓట్లు, అసంతృప్తులు, ప్రతిపక్షాల ఓటర్లు, తటస్థంగా ఉండేవాళ్ళు, ఏ పార్టీకి చెందని వాళ్ళు.. ఇలా కేటగిరీలుగా డివైడ్ చేశారు. వీళ్ళల్లో అసంతృప్తులు, ప్రతిపక్ష ఓటర్లను మినహాయించి.. మిగిలిన మూడు వర్గాల ఓట్లను కారు వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి 100 మంది ఓటర్లకు నలుగురు ఇంఛార్జిలను నియమించింది బీఆర్ఎస్ అధిష్టానం.
ఆ నలుగురు కూడా అదే పోలింగ్ బూత్‌లో ఓట్లు కలిగిన వారై ఉంటారు. వీళ్ళు ప్రతి రోజూ 100 మందిని కలుసుకుంటూ బీఆర్ఎస్‌కు ఓట్లేసేలా ఒప్పిస్తున్నారు. అలాగే నవంబర్ 30 నాడు ఆ వంద మందిలో ఎవరూ మిస్ అవకుండా పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓట్లు వేయించే బాధ్యత కూడా ఈ నలుగురే తీసుకుంటున్నారు. ఈ వ్యూహం పోలింగ్ తేదీ దాకా అమలు చేస్తారు. రాష్ట్రంలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలంటే ఈసారి పకడ్బందీ వ్యూహం తప్పదు అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు.