Hattrick CM KCR : హ్యాట్రిక్ కోసం కేసీఆర్ ప్లాన్ ..! అందుకేనా ఆ బెదిరింపులు ..!!
తెలంగాణ (Telangana) లో వరుసగా రెండు సార్లు అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లోసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ (Hattrick CM) కొట్టాలన్నది ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ( KCR) ప్లాన్. అందుకే ఎన్నికల ప్రచార సభల్లో ఈమధ్య కొత్తగా ఓ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు.
తెలంగాణ (Telangana) లో వరుసగా రెండు సార్లు అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లోసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ (Hattrick CM) కొట్టాలన్నది ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ( KCR) ప్లాన్. అందుకే ఎన్నికల ప్రచార సభల్లో ఈమధ్య కొత్తగా ఓ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. గత రెండుసార్లు తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకున్నారు. ఈసారి పథకాలతో ముందుకెళదాం అని ఆలోచించారు. కానీ చాలా మంది తమకు ప్రభుత్వ పథకాలు అందలేదని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద తిరగబడుతున్నారు. అందుకే కేసీఆర్ ఈసారి కొత్త స్ట్రాటజీతో ప్రచారం చేస్తున్నారు. జనాన్ని గందరగోళంలో పడేస్తున్నారు.
Heavy Rain In AP : నేడు తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
నేను ఓడిపోతే నష్టమేమీ లేదు.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటా అని కేసీఆర్ ఆ మధ్య బహిరంగ సభలో అన్నారు. కేటీఆర్ కూడా ఇంచు మించు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటర్వ్యూలో ఇలాగే మాట్లాడారు. దాంతో చాలామంది బీఆర్ఎస్ లీడర్లు హైరానా పడ్డారు. అదేంటి తమ అధినేతలు అలా అన్నారేంటి అనుకున్నారు. ఇక ప్రతిపక్ష లీడర్లయితే.. కేసీఆర్ ఓటమిని అంగీకరించారని ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఓడితే మీకే నష్టం అని పరోక్షంగా హెచ్చరికలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ను బూచిగా చూపెడుతూ.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమ పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరిస్తున్నారు. ధరణి రద్దు చేస్తే.. మళ్లీ పాత రెవెన్యూ వ్యవస్థ రోజులు వస్తాయి.. మీ భూములు, రైతు బంధు డబ్బులు దళారులు పంచుకుంటారని చెబుతున్నారు.
50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ లో కరెంట్ లేక చీకటి రోజులు చూశామనీ.. మళ్ళా అలాంటి రోజులు కావాలా.. కాంగ్రెసోళ్ళు రైతుబంధు దండగ అంటున్నారు.. రైతు బంధు ఉండాల్నా వద్దా.. చేతులు లేపండి అని బహిరంగ సభల్లో అడుగుతున్నారు కేసీఆర్. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఉంది.. కాంగ్రెస్ 3 గంటలు చాలు అంటోంది.. రైతులకు భరోసా కల్పించేందుకు రైతుబంధు, రైతు బీమా, ఇంటింటికీ తాగునీటి సరఫరా, దళితబంధు పథకం.. ఇలా ఎన్నో స్కీములు ఇస్తున్నాం. మళ్ళీ BRS రాకపోతే.. ఇవన్నీ ఆగిపోతయ్. అలాంటి ప్రమాదంలోకి మళ్ళీ పోదామా అని జనాన్ని ప్రశ్నిస్తున్నారు సీఎం కేసీఆర్. అంటే పరోక్షంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ పథకాలు ఆగిపోతయ్ అని కేసీఆర్ బెదిరిస్తున్నారాన్న అనుమానాలు కలుగుతున్నాయి.
Pawan Kalyan, Balayya : పవన్ కల్యాణ్ లాగే నేనూ ..! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారెంటీలు అమలవుతాయి.. కర్ణాటకలో అలాగే జరుగుతున్నాయ్.. అని కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం.. అక్కడ ఏ పథకాలు అమలు కావట్లేదనీ.. కాంగ్రెస్ ని గెలిపించి తప్పు చేశామని కన్నడ ప్రజలు బాధపడుతున్నారని అంటున్నారు. పైగా ఈ మధ్య టీవీల్లో ప్రసారం చేస్తున్న బీఆర్ఎస్ ప్రకటనల్లో కూడా రిస్క్ ఎందుకు తీసుకోవాలి.. కారు గుర్తుకే ఓటేద్దాం అంటూ వెరైటీ ప్రచారం మొదలుపెట్టింది గులాబీ పార్టీ.
Bigg Boss 7 : అర్జున్ చేతికి ఎవిక్షన్ ఫ్రీ పాస్.. కానీ అంతలోనే.. ట్విస్ట్ మీద ట్విస్ట్ ..?
ఇది కాకుండా.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని బీఆర్ఎస్.. ప్రచారం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మాటలతో అసలు ఏది నిజం.. ఏది అబద్దమో తెలియక సామాన్య జనం గందరగోళంలో పడుతున్నారు. 6 గ్యారంటీల ఇస్తామన్న కాంగ్రెస్ కు ఓటేయాలని.. ప్రస్తుత పథకాలు రావనే భయంతో కారు గుర్తుకే ఓటెయ్యాలా.. అని కన్ ఫ్యూజన్ లో ఉన్నారు. ఇదంతా ఎందుకు.. మళ్ళా బీఆర్ఎస్ కే ఓట్లేస్తే పోలా అన్న డెసిషన్ కు తీసుకు రావాలన్న ప్లాన్ లో సీఎం కేసీఆర్ ఉన్నారు.