Ponnala Lakshmaiah : బీఆర్ఎస్‌లోకి పొన్నాల.. కేటీఆర్ ఆఫర్ ఏంటి?
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ పార్టీలన్నీ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాలను.. తమ పార్టీలోకి ఆహ్వానించింది బీఆర్ఎస్. పొన్నాల ఇంటికి వెళ్లి మరీ బీఆర్ఎస్ లోకి రావాలని కేటీఆర్ కోరారు. మంత్రి ఆహ్వానాన్ని పొన్నాల కూడా స్వాగతించారు.
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ పార్టీలన్నీ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాలను.. తమ పార్టీలోకి ఆహ్వానించింది బీఆర్ఎస్. పొన్నాల ఇంటికి వెళ్లి మరీ బీఆర్ఎస్ లోకి రావాలని కేటీఆర్ కోరారు. మంత్రి ఆహ్వానాన్ని పొన్నాల కూడా స్వాగతించారు. పొన్నాలతో భేటీ తర్వాత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బలహీన వర్గాల బలమైన గొంతుక పొన్నాలను.. బీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానించానని.. దానికి సానుకూలంగా స్పందించారని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచన మేరకే వచ్చానని.. కేసీఆర్ ను పొన్నాల రెండు రోజుల్లో కలుస్తారని క్లారిటీ ఇచ్చారు.
పొన్నాలకు ఆఫరేంటి ..?
16న జనగామలో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరాలని తాను కోరానని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌లో పొన్నాలకు సముచిత గౌరవం ఇస్తామని.. పొన్నాలపై పీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ బాధాకరం అంటూ వ్యాఖ్యలు చేశారు. జనగామ సభలో కేసీఆర్ సమక్షంలో పొన్నాల పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక అటు జనగామ బీఆర్ఎస్ టికెట్ పొన్నాలకు ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే బీసీ నాయకుడిని కలిసినట్లు పొలిటికల్‌గా చర్చ నడుస్తోంది. పొన్నాల బీసీ నాయకుడు కావడం.. పైగా రాజకీయ అనుభవం కలిగిన నేత అయి ఉండడం బీఆర్ఎస్‌కు కలిసొచ్చే అవకాశంగా భావిస్తోంది. పైగా కొద్దిరోజులుగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య సీటు పంచాయితీతో కేడర్ అయోమయానికి గురైంది.
గులాబీ పార్టీకి భారీ ఆయుధం దొరికిందా ?
ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికల సమయానికి ఎలాంటి తల నొప్పులు వస్తాయోనని గులాబీ పార్టీ అనుమానిస్తోంది. దీంతో ఎలాంటి గందరగోళం లేకుండా పొన్నాలకు సీటు ఇస్తే బాగుంటుందని బీఆర్ఎస్ ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. పొన్నాల చేరికతో గులాబీ పార్టీకి భారీ ఆయుధం లభించినట్లే. కాంగ్రెస్ నుంచి కారు పార్టీకి గట్టి పోటీ కనిపిస్తోంది. ముఖ్యంగా బీసీ నినాదం ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఐతే ఓ బీసీ నేతలు కాంగ్రెస్ అన్యాయం చేసిందని.. రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బీసీల పట్ల అతని అహంకారానికి నిదర్శనం అనే ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు గులాబీ పార్టీ సిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయ్. ఇది వర్కౌట్ అయితే.. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ మీద భారీ ఆయుధం దొరికినట్లే. పొన్నాలను కలిసిన తర్వాత కేటీఆర్ మాటలు కూడా బీసీ యాంగిల్‌లోనే వినిపించడం.. బీఆర్ఎస్ వ్యూహాన్ని చెప్పకనే చెప్తున్నాయనే చర్చ జరుగుతోంది.