ASSEMBLY ELECTIONS: బీఆర్ఎస్‌కు ఆ రెండు గుర్తుల టెన్షన్‌.. సిద్ధిపేట, గజ్వేల్‌లోనే టార్గెట్‌..

ఇంకొన్ని గంటల్లో పోలింగ్‌ జరగబోతున్న వేళ.. ఆ రెండు గుర్తులు గులాబీ పార్టీని టెన్షన్‌లోకి నెట్టేస్తున్నాయ్. అవే.. రోడ్డు రోలర్‌, చపాతీ మేకర్‌ గుర్తులు. ఇప్పుడు బీఆర్ఎస్‌ నేతలకు ఆందోళన పుట్టిస్తున్నాయివి. సంగారెడ్డి, గజ్వేల్‌, సిద్ధిపేట.. నియోజవర్గాల్లో ఈ రెండు గుర్తులను స్వతంత్య్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 29, 2023 | 04:00 PMLast Updated on: Nov 29, 2023 | 4:00 PM

Brs In Tension Due To Party Symbols Like Car

ASSEMBLY ELECTIONS: గురుతుల గుర్తుంచుకో రామక్కా అని.. కారు పార్టీ మోగించిన మోత అంతా ఇంతా కాదు. ఐతే ఇప్పుడు ఆ గుర్తులే.. గులాబీ పార్టీ నేతల గుండెల్లో పరుగులు పెట్టిస్తున్నాయ్. గుర్తుల విషయంలో.. బీఆర్ఎస్‌కు ప్రతీసారి టెన్షనే ఎదురవుతోంది. గతంలో ఈసీ వరకు కూడా వెళ్లారు. 8 గుర్తులను అసలు కేటాయించొద్దు అంటూ.. విన్నపాల మీద విన్నపాలు చేశారు కూడా ! ఇంకొన్ని గంటల్లో పోలింగ్‌ జరగబోతున్న వేళ.. ఆ రెండు గుర్తులు గులాబీ పార్టీని టెన్షన్‌లోకి నెట్టేస్తున్నాయ్. అవే.. రోడ్డు రోలర్‌, చపాతీ మేకర్‌ గుర్తులు. ఇప్పుడు బీఆర్ఎస్‌ నేతలకు ఆందోళన పుట్టిస్తున్నాయివి. సంగారెడ్డి, గజ్వేల్‌, సిద్ధిపేట.. నియోజవర్గాల్లో ఈ రెండు గుర్తులను స్వతంత్య్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించింది.

ASSEMBLY ELECTIONS: అసెంబ్లీ ఎన్నికలకు భారీ బందోబస్తు.. ఖర్చు ఎన్ని కోట్లంటే..

నారాయఖేడ్, ఆందోల్, దుబ్బాకలో BRS అభ్యర్థుల ఓట్లకు రోడ్డు రోలర్ గండి కొట్టే అవకాశాలు కనిపిస్తుండగా.. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో చపాతీ మేకర్.. గులాబీ నేతలను టెన్షన్ పెట్టిస్తోంది. సంగారెడ్డిలో గోపాల్ అనే అభ్యర్థికి రోడ్‌ రోలర్‌ గుర్తును, నర్సింహులు అనే అభ్యర్థికి చపాతీ మేకర్‌ గుర్తును కేటాయించింది ఈసీ. సిద్ధిపేటలో శ్రీనివాస్ అనే అభ్యర్థికి రోడ్‌రోలర్‌ గుర్తును.. సాయికుమార్ అనే మరో అభ్యర్థికి చపాతీ రోలర్‌ గుర్తును కేటాయించింది. గజ్వేల్‌లో రఘుమారెడ్డి అనే అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించగా.. కిన్నెర యాదయ్య అనే అభ్యర్థికి చపాతీ రోలర్ గుర్తు వచ్చింది. ఇక నారాయణఖేడ్‌లో గోపాల్‌ రెడ్డి అనే అభ్యర్థికి రోడ్డు రోలర్‌ గుర్తు వచ్చింది. ఆందోల్‌లో బెగరి అశోక్‌ అనే అభ్యర్థికి, దుబ్బాకలో భుజంగం పటేల్ అనే అభ్యర్థికి రోడ్డు రోలర్‌ గుర్తు కేటాయించగా.. జహీరాబాద్‌లో నర్సింహులు అనే అభ్యర్థికి, మెదక్‌లో కుమార్‌ అనే అభ్యర్థికి చపాతీ మేకర్‌ గుర్తు కేటాయించింది ఈసీ. ఐతే గుర్తులతో టెన్షన్ ఏంటంటే.. చపాతీ మేకర్‌, రోడ్డు రోలర్‌ గుర్తులు.. బీఆర్ఎస్‌ గుర్తు అయిన కారును పోలి ఉంటాయ్‌.

గతంలో కారు పార్టీకి ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయ్. 2018 ఎన్నికల్లో మునుగోడు, జహీరాబాద్‌, సిర్పూర్‌, డోర్నకల్‌లాంటి స్థానాల్లో సీపీఎం, బీఎస్పీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయ్. గుర్తును సరిగ్గా గుర్తించలేని ఓటర్లలో చాలా మంది.. కారు గుర్తును పోలి ఉన్న గుర్తు మీద గుద్దేశారు. అందుకే కారు గుర్తును పోలి ఉండే.. కెమెరా, చపాతి రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని.. గతంలోనే ఈసీకి విన్నపాలు చేసింది బీఆర్ఎస్. ఐతే ఇప్పుడు అవే గుర్తులు.. స్వతంత్ర్య అభ్యర్థులకు కేటాయించడంతో ఈసారి ఏం జరగబోతుందో అనే టెన్షన్ గులాబీ పార్టీ నేతలను వెంటాడుతోంది. మిగతాచోట్ల ఎలా ఉన్నా.. గజ్వేల్‌లాంటి స్థానాల్లో మరీ టెన్షన్ పుట్టిస్తోంది. గజ్వేల్‌లో కేసీఆర్ మీద ఈటల పోటీ చేస్తున్నారు. ప్రస్తుత సమీకరణాల ప్రకారం.. నెక్‌ టు నెక్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయ్. ఇలాంటి చోట్ల తమకు పడాల్సిన ఓట్లు.. కారును పోలిన గుర్తుకు పడితే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుందని గులాబీ నేతలు గుబులు చెందుతున్నారు.