BRS : బీఆర్ఎస్ కి మౌత్ టాక్ భయం..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి మరో రెండు రోజులే టైమ్ ఉంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే బీఆర్ఎస్ కి మాత్రం మౌత్ టాక్ భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నేతలు.. మౌత్ టాక్ ను నమ్మొద్దు.. మీరే ప్రచారం చేస్తే ఎలా .. అంటూ పార్టీ అభ్యర్థులు, లీడర్లను హెచ్చరిస్తున్నారు. ఇంతకూ ఏంటా మౌత్ టాక్ .. నోటి మాటకు అంతగా ఎందుకు భయపడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2023 | 12:50 PMLast Updated on: Nov 26, 2023 | 12:50 PM

Brs Is Afraid Of Mouth Talk

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి మరో రెండు రోజులే టైమ్ ఉంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే బీఆర్ఎస్ కి మాత్రం మౌత్ టాక్ భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నేతలు.. మౌత్ టాక్ ను నమ్మొద్దు.. మీరే ప్రచారం చేస్తే ఎలా .. అంటూ పార్టీ అభ్యర్థులు, లీడర్లను హెచ్చరిస్తున్నారు. ఇంతకూ ఏంటా మౌత్ టాక్ .. నోటి మాటకు అంతగా ఎందుకు భయపడుతున్నారు.

రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ వేవ్ నడుస్తోంది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందట.. రూరల్ లో ఆ పార్టీకే బలం ఉందట. ఖమ్మంలో కాంగ్రెస్ స్వీప్ చేస్తుండట.. నల్లగొండ, మహబూబ్ నగర్ లోనూ కాంగ్రెస్ బలమైన అభ్యర్థులు ఉన్నారు. గెలిచేవాళ్ళకే సీట్లు ఇచ్చింది కాంగ్రెస్. ఇలాంటి పాజిటివ్ టాక్ జనంలో నడుస్తోంది.

K Laxman: తెలంగాణలో బీజేపీ గెలిస్తే మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రిని చూస్తారు

ఈ టాక్ సాధారణ జనంతో పాటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా వినిపిస్తోంది. ఇదే తమ పార్టీ కొంప ముంచుతుందని బీఆర్ఎస్ అధిష్టానం భయపడుతోంది. వారం క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సిరిసిల్ల కేడర్ తో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. అందులో అక్కడ వాళ్ళకి లీడ్ ఉంది.. ఇక్కడ వీళ్ళకి లీడ్ ఉంది అని మీరే మౌత్ టాక్ చేస్తే ఎలా… మనంతట మనం వేరే పార్టీకి ప్రచారం చేస్తున్నాం. ముందు మౌత్ టాక్ లు బంద్ పెట్టండి అంటూ క్లాస్ పీకారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా ఫాంహౌజ్ లో అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జులతో భేటీ అయ్యారు. మౌత్ టాక్ తో గాబరా పడొద్దని క్లియర్ గా చెప్పారు. గ్రౌండ్ బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉంది.. మౌత్ టాక్స్ పట్టించుకోవద్దు. పోలింగ్ తేదీ దాకా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.

Telangana elections : బీజేపీ అధికారంలోకి వస్తే.. హైదరాబాద్ పేరు మారుస్తాం..

బీఆర్ఎస్ కు రెండుసార్లు అధికారం ఇచ్చాం. ఈసారి కాంగ్రెస్ కు ఇద్దాం అనే భావన చాలామందిలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు చాలామటుకు అందలేదు. కనీసం కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో అయినా అందుతాయన్న ఆశ జనంలో కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో మౌత్ టాక్ బలంగా వినిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. ఈ టాక్ తో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారేమో అన్న భయం కారు పార్టీకి కూడా పట్టుకుంది. ఈ నోటిమాటలు నగరాలు, పట్టణాల నుంచి పల్లెల దాకా పాకడంతో బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి ప్రభుత్వ వ్యతిరేకత అయితే బాగానే ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యలపై అసంతృప్తి ఉంది. అవినీతి, భూకబ్జాల ఆరోపణలను ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ టిక్కెట్లు ఇవ్వడం కూడా ఆ పార్టీ ఓటమికి కారణమవుతోంది. ఆ నోటా ఈ నోటా కాంగ్రెస్ పేరే వినిపిస్తే… తటస్థంగా ఉండేవాళ్ళు సైతం తమ ఓటు ఎందుకు వృధా చేసుకోవాలని చెయ్యి గుర్తుపైనే ఓట్లేసే అవకాశాలున్నాయి. సో మౌత్ టాక్ గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అయితే రైతుబంధుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడం బీఆర్ఎస్ కు కలిసొస్తుందని అంటున్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే కాంగ్రెస్ పై మౌత్ టాక్ కట్టడి అవుతుందని బీఆర్ఎస్ లీడర్లు ఆశలు పెట్టుకున్నారు.