బ్రేకింగ్: సురేఖకు షాక్ ఇచ్చిన కేటిఆర్
మంత్రి కొండా సురేఖకు కేటిఆర్ షాక్ ఇచ్చారు. తనపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన కోర్ట్ లో పరువు నష్టం దావా వేసారు. నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసారు కేటిఆర్.

మంత్రి కొండా సురేఖకు కేటిఆర్ షాక్ ఇచ్చారు. తనపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన కోర్ట్ లో పరువు నష్టం దావా వేసారు. నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసారు కేటిఆర్. ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వరావు పిటిషన్ దాఖలు చేసారు. ఇటీవల కేటిఆర్ పై మంత్రి కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యల విషయంలో అటు అక్కినేని కుటుంబం కూడా ఇప్పటికే కోర్ట్ మెట్లు ఎక్కింది. సమంతాకు క్షమాపణలు చెప్పి వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్న సురేఖ… కేటిఆర్ కు మాత్రం చెప్పేది లేదన్నారు. కేటిఆర్ తనకు క్షమాపణలు చెప్పాల్సిందే అని ఇప్పటికే లీగల్ నోటీస్ కూడా పంపారు. అయితే తనకే కేటిఆర్ క్షమాపణలు చెప్పాలని కొండా సురేఖ డిమాండ్ చేస్తున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం కోర్ట్ కి వెళ్ళింది.