Governor Tamilisai: నామినేటెడ్ ఎమ్మెల్సీల తిరస్కరణ.. గవర్నర్ నిర్ణయంపై హైకోర్టుకు బీఆర్ఎస్..
దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో కేసీఆర్ ఆధ్వర్యంలోని మంత్రిమండలి తీర్మానం చేసింది. మంత్రిమండలి నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసైకి పంపారు. అయితే, దీన్ని గతేడాది సెప్టెంబర్ 19న గవర్నర్ తిరస్కరించారు.
Governor Tamilisai: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో కేసీఆర్ ఆధ్వర్యంలోని మంత్రిమండలి తీర్మానం చేసింది.
YS JAGAN IN SHOCK: జగన్‌కు షాక్.. టీడీపీలో చేరిన విజయసాయి బావమరిది..
మంత్రిమండలి నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసైకి పంపారు. అయితే, దీన్ని గతేడాది సెప్టెంబర్ 19న గవర్నర్ తిరస్కరించారు. వీరిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకునేందుకు నిరాకరించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదమైంది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, మంత్రి మండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు జనవరి 5, శుక్రవారం నాడు విచారణ చేపట్టనుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతుంది.
ఈ అంశంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కొన్నేళ్లుగా గవర్నర్ తమిళిసైకి, కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనేక అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తమిళిసై వ్యతిరేకిస్తూ వచ్చారు. పలు బిల్లులను తిప్పి పంపారు. ఇంకొన్నింటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వ్యవహరించారు.