BRS: బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారా..?
మెదక్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారంటూ బీఆర్‌ఎస్‌లో టాక్ నడుస్తోంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేసేందుకే ప్రభాకర్‌ను దుబ్బాకకు పంపించారనే టాక్ కూడా ఉంది.
BRS: అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తరువాత.. పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది బీఆర్‌ఎస్ పార్టీ. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి.. కేంద్రంలో తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి ఎంపీ అభ్యర్థులుగా కీలక వ్యక్తుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. కేసీఆర్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మెదక్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారంటూ బీఆర్‌ఎస్‌లో టాక్ నడుస్తోంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేసేందుకే ప్రభాకర్‌ను దుబ్బాకకు పంపించారనే టాక్ కూడా ఉంది.
Sukesh Chandrasekhar: ప్రేమ పిశాచి.. బేబీ.. ఆరోజు బ్లాక్ కుర్తా వేసుకొని రా!
ఇక మహబూబ్‌నగర్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను బరిలో దింపబోతోంది బీఆర్ఎస్ పార్టీ. మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేసిన వ్యక్తిగా పేరుండటం, బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నేత అవ్వడం శ్రీనివాస్‌గౌడ్‌కు కలిసివచ్చే అంశాలు. ఈ కారణంగానే ఇక్కడి నుంచి పోటీగా ఉన్న మన్నె శ్రీనివాస్‌ను కూడా కాదని శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక చేవెళ్ల నుంచి మరోసారి రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్న రంజిత్ ఇప్పుడు మరోసారి పోటీ చేయబోతున్నారు. ఇక జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్‌ను మరోసారి బరిలో దించబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడ లింగాయత్‌ల కమ్యూనిటీ ఎక్కవగా ఉండటం, బీబీ పాటిల్ స్వయంగా అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అవ్వడంతో టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక నాగర్ కర్నూల్ నుంచి గువ్వల బాలరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడి నుంచి పోతుగంటి రాములు సిట్టింగ్ ఎంపీగా ఉన్నా.. బాలరాజు విషయంలో బీఆర్ఎస్ సానుకూలంగా ఉన్నట్టు టాక్. ఇక కరీంనగర్ నుంచి వినోద్‌కు టికెట్ ఫైనల్ చేశారు. మరో కీలక నియోజకవర్గం పెద్దపల్లి నుంచి బాల్క సుమన్, వెంకటేష్ నేత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్ నుంచి కవితకు టికెట్ కన్ఫాం అయ్యింది. ఇక్కడ ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతోంది.
BRS CLOSE TO BJP : గులాబీ-కమలం కలుస్తాయా ? కవిత హిందూత్వ కామెంట్స్ దేని కోసం ?
దీంతోపాటు ఆదిలాబాద్‌లో కూడా టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడి నుంచి గూడెం నగేష్‌ను బరిలో దింపబోతోంది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ నుంచి ఇక్కడ సోయం బాపురావు ఎంపీగా ఉన్నారు. దీంతో పోరు గట్టిగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక వరంగల్ నుంచి పసూనూరి దయాకర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ డాక్టర్ రాజయ్య పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రీసెంట్‌గా అసెంబ్లీ ఎన్నిక సమయంలో వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామంటూ కేసీఆర్.. రాజయ్యకు హామీ ఇచ్చినట్టు టాక్. ఇక నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డిని బరిలో దింపబోతున్నట్టు తెలుస్తోంది భువనగిరి నుంచి బాలరాజు యాదవ్‌కు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి నామా నాగేశ్వర్‌రావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మళ్లీ ఆయనకే మొగ్గు చూసుతోంది బీఆర్‌ఎస్. ఇక మహబూబాబాద్ నుంచి రెడ్యా నాయక్‌కు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్‌గిరి నుంచి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్‌గా రేవంత్ రెడ్డితో విభేదించి కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి. రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపించడంలో సింగిరెడ్డి కీలక పాత్ర పోషించారు.
దీంతో ఇప్పుడు ఆయనకే టికెట్ ఇచ్చే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సికింద్రాబాద్ నుంచి మరోసారి తలసాని కొడుకు సాయికిరణ్‌కు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ టికెట్ల విషయంలో ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారికంగా ప్రకటన రావాల్సిఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపిన తెలంగాణ ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేస్తారో చూడాలి.