బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించారు. గంట పాటు విచారణ చేసిన స్టేట్మెంట్ రికార్డ్ చేసారు పోలీసులు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బంజారాహిల్స్ సిఐ ఫిర్యాదు గురించి నన్ను 32 ప్రశ్నలు అడిగారని నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. 6 హామీలు పై ప్రశ్నిస్తే నా పై కేసులు పెడుతున్నారన్నారు. డిసెంబర్ 4 రోజున నేను బంజారాహిల్స్ పీఎస్ కి ఫిర్యాదు చేయడానికి వెళ్ళానని వివరించారు. బంజారాహిల్స్ ఏసీపీ అపాయిట్మెంట్ తీసుకొని వెళ్ళానన్నారు. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపై కేసులు పెట్టారన్నారు. నేను ఇచ్చిన ఫిర్యాదు పై ఇప్పటి వరకు ఎందుకు FIR నమోదు చేయలేదని ప్రశ్నించారు. పండుగ రోజు కూడా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారన్నారు. అడిగిన ప్రశ్నే అడిగారు.. నేను అన్నిటికీ సమాధానం చెప్పానని తెలిపారు. [embed]https://www.youtube.com/watch?v=jvhI67IZ3uM[/embed]