బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: కాంగ్రెస్

అదాని ని అరెస్ట్ చేస్తే ప్రధాని మోడీ రాజీనామా చేయక తప్పదన్నారు తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదాని,అంబానీ లాంటి బడా పెత్తందారులని పెంచి పోషిస్తుందని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పాడన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 22, 2024 | 05:01 PMLast Updated on: Nov 22, 2024 | 5:01 PM

Brs Mlas Are In Touch Congress

అదాని ని అరెస్ట్ చేస్తే ప్రధాని మోడీ రాజీనామా చేయక తప్పదన్నారు తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదాని,అంబానీ లాంటి బడా పెత్తందారులని పెంచి పోషిస్తుందని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పాడన్నారు. సెబీ ఛైర్మన్ మాధవి బుచ్ ఆధాని కి లాభం చేకూర్చిందని మండిపడ్డారు. నిష్పక్ష పాతంగా విచారణ చేస్తే మోడీ రాజీనామా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ప్రధాని అండతో అదాని గ్రూప్ విచ్చలవిడిగా సంపద పెంచుకుండు అని మండిపడ్డారు. పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేసారు. జేపీసీ లో ఎవరు దోషులుగా తెలినా శిక్షించాల్సిందేనాన్న ఆయన స్కిల్ యూనివర్సిటీకి అదాని 100 కోట్లు ఇచ్చిండని సీఎం రేవంత్ రెడ్డికి ఇంటికి కాదని క్లారిటీ ఇచ్చారు. కేటిఆర్ కూడా 50 కోట్లు స్కిల్ యూనివర్సిటీ కి ఇవ్బొచ్చన్నారు. కాంగ్రెస్ లోకి మరింత మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్దంగా ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.