బిగ్ బ్రేకింగ్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటి అయిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి.. పార్టీలో చేరే అంశంపై చర్చించినట్టు వస్తున్న వార్తలు నిజమే అని తేలిపోయింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటి అయిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి.. పార్టీలో చేరే అంశంపై చర్చించినట్టు వస్తున్న వార్తలు నిజమే అని తేలిపోయింది. చంద్రబాబుని కలిసిన అనంతరం తీగల కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే తెలుగుదేశం, చంద్రబాబు వల్లనే అని కొనియాడారు. తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు చాలా మంది ఉన్నారన్నారు.
తెలంగాణలో టీడీపీ కి మళ్ళి పూర్వ వైభవం తీసుకోస్తామని ధీమా వ్యక్తం చేసారు. త్వరలో టీడీపీ లో జాయిన్ అవుతాను అని ఆయన స్పష్టం చేసారు. నాతో పాటు చాల మంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వస్తారన్నారు తీగల. మీడియాతో మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి నిరాకరించారు.