Kavitha Arrest?: చార్జిషీట్‌లో భర్త పేరు.. అప్రూవర్‌గా సీఏ.. కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం అయినట్లేనా?

తెలంగాణలో పొలిటికల్‌ ప్రకంపనలు రేపుతోన్న ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌... ఫైనల్‌ ఎపిసోడ్‌కు చేరుకుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేసేందుకు కేంద్ర దర్యాప్తు వేగంగా పావులు కదుపుతున్నట్లుగా సీన్ కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 2, 2023 | 10:12 PMLast Updated on: May 02, 2023 | 10:12 PM

Brs Mlc Kavitha Arrest Soon In Delhi Liquor Scam Case

తెలంగాణలో పొలిటికల్‌ ప్రకంపనలు రేపుతోన్న ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌… ఫైనల్‌ ఎపిసోడ్‌కు చేరుకుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేసేందుకు కేంద్ర దర్యాప్తు వేగంగా పావులు కదుపుతున్నట్లుగా సీన్ కనిపిస్తోంది.

మూడో ఛార్జి షీట్‌ దాఖలు చేసిన ఈడీ.. అందులో కవితతో పాటు ఆమె భర్త అనిల్‌కుమార్‌ మీద కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఆర్థిక లావాదేవీలపై కీలక అభియోగాలు మోపిన ఈడీ… లిక్కర్ స్కాంలో కవితే ముడుపులు ఇచ్చారని క్లియర్‌గా ఆరోపించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత… తమ బినామీల ద్వారా వ్యాపారం చేశారని తెలిపింది. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా కవిత భూములు కొనుగోలు చేశారని చార్జిషీట్‌లో వివరించింది ఈడీ.

ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణను ఎదుర్కొన్న కవిత పేరును ఛార్జిషీట్‌లో ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. నిందితుల లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ను ఛార్జిషీట్‌లో జత చేసింది. తనకున్న పలుకుబడితో హైదరాబాద్ లో తక్కువ ధరకే కవిత భూములు కొన్నారని తెలిపింది. భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది. చార్జ్ షీట్‌లో కవిత భర్త అనిల్ కుమార్‌తో పాటు.. ఆమె సన్నిహితుల పేర్లను చేర్చింది ఈడీ. తొలిసారిగా కవిత భర్త పేరు ప్రస్తావనకు రావడం హైలైట్‌. కవిత మాజీ ఆడిటర్‌‌ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారాడు. కేసులో దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తానని చెప్పాడు. దీంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సౌత్‌గ్రూప్‌ లిక్కర్ సిండికేట్‌ చిట్టా బయటపడనుంది.

ఈ కేసులో ఇప్పటికే అరుణ్‌ రామచంద్ర పిళ్లై, విజయ్‌ నాయర్‌‌, దినేష్‌ అరోరాలు అప్రూవర్‌లుగా మారారు. సౌత్‌గ్రూప్‌ ఆడిటర్‌‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు కూడా అప్రూవర్‌‌గా మారడంతో సీబీఐ, ఈడీ దర్యాప్తుకు లైన్ మరింత క్లియర్ అయింది. లిక్కర్ పాలసీ స్కామ్‌లో సౌత్‌గ్రూప్‌ నుంచి అరుణ్‌రామచంద్రపిళ్లై, బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించారు. కవిత ప్రస్తుతం స్వల్ప అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఐతే రేపో మాపో కవితను ఈడీ పిలవబోతోందనీ… విచారణకు హాజరైతే అరెస్టు తప్పదనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్. దీంతో ఈ కేసులో నెక్ట్స్ ఏం జరగబోతోందన్నది మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది.