పింక్ బుక్ స్టార్ట్ చేసాం: కవిత
బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తే సహించేది లేదంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేసారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందన్నారు కవిత.

ED searches at residence of BRS MLC Kavitha Adabidda Akhila..
బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తే సహించేది లేదంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేసారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందన్నారు కవిత. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటామన్నారు.
కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదని కాంగ్రెస్ అధికారంలో ఉందని రెచ్చిపోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని, కార్యకర్తలను ఎవరూ టచ్ చేయలేరన్నారు.