CONGRESS: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. రేవంత్‌తో భేటీ..

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్‌ సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. వరంగల్‌కు చెందిన మంత్రి కొండా సురేఖతో కలిసి దయాకర్.. రేవంత్‌ను కలిశారు. చేవెళ్ల బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2024 | 04:59 PMLast Updated on: Mar 15, 2024 | 4:59 PM

Brs Mps And Mlas Are Joining In Congress Soon

CONGRESS: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్‌‌ను వీడుతున్నారు. మరికొందరు కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్‌ సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. వరంగల్‌కు చెందిన మంత్రి కొండా సురేఖతో కలిసి దయాకర్.. రేవంత్‌ను కలిశారు. వరంగల్ ఎంపీ టిక్కెట్ విషయంలో ఆయన బీఆర్ఎస్‌‌పై అసంతృప్తితో ఉన్నారు.

MLC KAVITHA: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు..

వరంగల్ బీఆర్ఎస్ టిక్కెట్‌ను సిట్టింగ్ అయిన తనకు కాకుండా.. కడియం కావ్యకు ఇవ్వడంతో దయాకర్ బీఆర్ఎస్‌పై అలకతో ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్‌‌ను కలిశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సీఎం రేవంత్‌ను కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్‌తో కలిసి దానం.. రేవంత్‌ను కలిశారు. త్వరలోనే ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం. చేవెళ్ల బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. చేవెళ్ల కాంగ్రెస్ టిక్కెట్ సునీత మహేందర్ రెడ్డికి ఇవ్వాల్సి ఉంది. అయితే, సర్వేల్లో ఆమెకు వ్యతిరేకంగా ఉండటంతో టికెట్ నిరాకరించినట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపి రంజిత్ రెడ్డికే సర్వేలు మొగ్గు చూపుతున్నాయి.

దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని చేవెళ్ల టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా ఎంపీ రంజిత్ రెడ్డి వెంటే ఉండి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం. దీంతో ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలు వరుసగా ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్‌లో చేరుతుండటం సంచలనంగా మారింది.