Raghunandan Rao: దుబ్బాకలో బీఆర్ఎస్ భారీ స్కెచ్‌.. రఘునందన్‌కు చెక్‌ పడడం ఖాయమా ?

బీఆర్ఎస్‌కు కొరకరాని కొయ్యలా మారిన లీడర్లు ఎవరు అని లిస్ట్ తీస్తే.. రఘనందన్‌ పేరు టాప్‌లో ఉంటుంది. రాజకీయాల్లో ఎవరైనా మాటలతో కొడతారు.. రఘునందన్‌ మాత్రం లాజిక్కులతో కొడతారు. పక్కా లెక్కలు చూపించి మరీ.. ప్రభుత్వాన్ని నిలదీస్తుంటారు. 2020లో జరిగన ఉపఎన్నికలో దుబ్బాక నుంచి మొదటిసారి గెలిచిన రఘునందన్‌.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2023 | 08:30 PMLast Updated on: May 08, 2023 | 8:30 PM

Brs Party Strategy For Won In Dubbaka

రఘునందన్ విజయంతోనే.. తెలంగాణలో బీజేపీకి జోష్‌ వచ్చింది. దుబ్బాకలో విజయం తర్వాతే.. గ్రేటర్ ఎన్నికల్లోనూ, హుజురాబాద్‌లోనూ కమలం పార్టీ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. అలాంటి దుబ్బాకలో రఘునందన్‌కు చెక్‌ పెట్టి.. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని కారు పార్టీ కసి మీద కనిపిస్తోంది. బీఆర్ఎస్‌కు కంచుకోటలాంటి నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి. అలాంటి స్థానంలో రఘునందన్‌ సూపర్ విక్టరీ కొట్టారు. బీఆర్ఎస్‌ అధికారంలో ఉంటూ కూడా.. దుబ్బాకను నిలుపులేకపోయింది. అలాంటి చోట మళ్లీ గెలిచి తీరాలని బీఆర్ఎస్ కసి మీద ఉంది.

కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు దుబ్బాక మీద. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్ధిని రంగంలో దించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. దుబ్బాకలో పోటీ చేయడానికి అంతా ప్రిపేర్ చేసుకున్నారని తెలుస్తోంది. దుబ్బాకలో గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్లు టాక్‌. ఇప్పటికే దుబ్బాకలో పోటీకి కే‌సి‌ఆర్ నుంచి కొత్త ప్రభాకర్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రెండుసార్లు ఎంపీగా గెలిచారు.

2014లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కే‌సి‌ఆర్.. మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నికలో మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ గెలిచారు. 2019లో కూడా ఈయనే పోటీ చేసి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. అక్కడ ఎలాగో రామలింగారెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో అంతగా యాక్టివ్‌గా లేదు. దీంతో ఈసారి దుబ్బాక సీటు ప్రభాకర్‌కే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో రఘునందన్ గట్టి పోటీ ఎదురుకునే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికల సమయానికి ఉండే పరిస్థితుల ఆధారంగా.. దుబ్బాక రాజకీయం మారనుంది. రఘునందన్‌కు చెక్ పెట్టి తీరాలన్న కారు పార్టీప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేదా అనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.