Danam Nagender: అనర్హత వేటు తప్పదా? దానంకు 3 నెలలే గడువు
ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చింది. మరి స్పీకర్ దానం అనర్హతపై వెంటనే నిర్ణయం తీసుకుంటారా.. లేకపోతే గత ప్రభుత్వాల్లో లాగా ఐదేళ్ళ పాటు తన దగ్గరే పెట్టుకొని ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేస్తారా.. అన్నది చూడాలి.
Danam Nagender; బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ గేట్లు తెరిచిన తర్వాత వచ్చిన మొదటి BRS ఎమ్మెల్యే దానం. ఇప్పటిదాకా బీఆర్ఎస్ నేతలు, సిట్టింగ్ ఎంపీలు మాత్రమే హస్తం పార్టీలో జాయిన్ అవుతున్నారు. కానీ ఎమ్మెల్యేల్లో మాత్రం దానం ఫస్ట్ క్యాండిడేట్. దాంతో ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ఇస్తారా.. లేదంటే మంత్రి పదవి ఇస్తారా అన్నది చూడాలి. కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.
BANDARU SATYANARAYANA: టీడీపీకి షాక్.. వైసీపీలోకి టీడీపీ కీలక నేత
ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చింది. మరి స్పీకర్ దానం అనర్హతపై వెంటనే నిర్ణయం తీసుకుంటారా.. లేకపోతే గత ప్రభుత్వాల్లో లాగా ఐదేళ్ళ పాటు తన దగ్గరే పెట్టుకొని ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేస్తారా.. అన్నది చూడాలి. కానీ గతంలో లాగా అనర్హత పిటిషన్లపై స్పీకర్లు ఐదేళ్ళు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం ఇప్పుడు కుదరదు. ఇటీవల మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఇలాంటి కేసుల విషయంలో 3 నెలలోగా స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. లేకపోతే ఆ రాష్ట్ర హైకోర్టులు వారి అనర్హతపై తీర్పులు చెప్పవచ్చని సూచించింది. అంటే దానం నాగేందర్ పై BRS ఇచ్చిన అనర్హత పిటిషన్ పై స్పీకర్ ప్రసాద్ కుమార్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. అప్పట్లోగా దానంపై అనర్హత వేటు వేయడానికి ఛాన్సుంది. BRSలో ప్రస్తుతం ఉన్న 39 ఎమ్మెల్యేల్లో 26 మందిని చీల్చి కాంగ్రెస్‌లోకి తీసుకొస్తే వాళ్ళపై పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదు. పైగా BRS LPని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో కేసీఆర్ స్ట్రాటజీనే.. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నారు.
ఆల్రెడీ కాంగ్రెస్ తలుపులు తీసి ఉంచామని చెప్పేశారు. అందువల్ల ఇటీవల రేవంత్‌ను కలిసిన ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు ఇంకొందరు కూడా కాంగ్రెస్ లో చేరతారన్న టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్, పార్టీని వీడిపోతున్న లీడర్లు, పార్లమెంట్ అభ్యర్థులు గెలుస్తారో లేదో అన్న టెన్షన్‌లో ఉన్న బీఆర్ఎస్ కు ఇప్పుడు ఎమ్మెల్యేల జంప్ భయం వెంటాడుతోంది. 26 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రాకపోతే మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడే అవకాశముంది. అందుకే దానం సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ గెలిస్తే.. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఉంటుందని ప్లాన్ చేస్తున్నారు.