KCR: ఈ వారం ఢిల్లీ టూర్‌కు కేసీఆర్‌.. బీజేపీతో పొత్తు ఖాయమేనా..?

బీఆర్ఎస్ ఒంటరిగా ఎంపీ ఎన్నికలకు వెళ్లదని.. బీజేపీ పొత్తు ఖాయం అని కొత్త ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. మల్లారెడ్డిలాంటి వాళ్లు అయితే.. డైరెక్ట్‌గానే పొత్తుల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2024 | 07:11 PMLast Updated on: Feb 19, 2024 | 7:12 PM

Brs President Kcr Tour To Delhi Meet Bjp Leaders

KCR: ఇలా జరుగుతుందని ఊహించగలిగితే.. అది రాజకీయమే కాదు. కేసీఆర్ స్ట్రాటజీలు అంతే ! ఆయన నిర్ణయాలు అంత ఈజీగా చిక్కవు ఎవరికీ ! ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతో.. జనాలు మార్పు కోరుకున్నారో.. ఇంకేదైనా కారణమో కానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది కారు పార్టీ. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి.. ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయింది. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు.. కారుకు, కాంగ్రెస్‌కు మధ్య జరుగుతున్న యుద్ధం అంతా ఇంతా కాదు.

Etela Rajender: లోక్‌సభ బరిలో ఈటల రాజేందర్.. ఆ స్థానం నుంచే పోటీ..?

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిదంటూ.. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇలాంటి పరిణామాల మధ్య.. ఇంకొన్ని రోజుల్లో లోక్‌సభ ఎలక్షన్స్‌ జరగబోతున్నాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని గులాబీ పార్టీ అధినేత ఫిక్స్ అయ్యారు. కాంగ్రెస్‌కు మించి సీట్లు దక్కించుకోవాలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారు. ఐతే బీఆర్ఎస్ ఒంటరిగా ఎంపీ ఎన్నికలకు వెళ్లదని.. బీజేపీ పొత్తు ఖాయం అని కొత్త ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. మల్లారెడ్డిలాంటి వాళ్లు అయితే.. డైరెక్ట్‌గానే పొత్తుల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఐతే ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ వారంలో కేసీఆర్‌.. ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఖాయం అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆయన హస్తిన పర్యటనకు సిద్ధం కావడం.. మరింత హాట్‌టాపిక్ అవుతోంది. ఎన్నికల తర్వాత.. మొదటిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. అదీ లోక్‌సభ ఎన్నికలకు ముందు కావడంతో.. ఆయన పర్యటనపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయ్.

బీజేపీతో పొత్తు కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని.. కమలం పార్టీ, కారు పార్టీ కలిసి పోటీ చేయడం ఖాయమనే మాట.. ఇప్పుడు మరింత బలంగా వినిపించడం మొదలైంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. బీజేపీ పెద్దలతో కేసీఆర్ భేటీ అవుతారని తెలుస్తోంది. ఐతే ఆయన ఎవరితో సమావేశం అవుతారు, ఏఏ అంశాలపై చర్చించబోతున్నారన్న విషయాలపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఐతే బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీస్తే.. కనీసం 13 సీట్లు గెలవొచ్చనే అంచనాలు వినిపిస్తుండడంతో.. రెండు పార్టీల పొత్తు దాదాపు ఖాయమే అనే చర్చ జరుగుతోంది. ఇక అటు ఈసారి కేంద్రంల ో4వందల ప్లస్ సీట్లు సాధించాలని కసి మీద బీజేపీ.. బీఆర్ఎస్‌తో పొత్తు వ్యవహారాన్ని లైట్‌ తీసుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇలా ఓవరాల్‌గా ఇప్పుడు కేసీఆర్ టూర్‌.. రాష్ట్ర రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది.