సమ్మక్క సాక్షిగా సీఎం హామీ ములుగులో భూకంపం, రేవంత్‌ను ఆడుకుంటున్న బీఆర్‌ఎస్
రాజకీయ నాయకులు అంటేనే ఒకరిమీద ఒకరు ఎప్పుడూ విమర్శలు చేసుకుంటూ ఉంటారు. టైం వస్తే చాలు ఒకరిని ఒకరు చెడుగుడాడుకుంటారు. ఒకప్పుడు.. పబ్లిక్ మీటింగ్స్‌లో మాత్రమే ఒకరిని ఒకరిని ఒకరు విమర్శించుకునే అవకాశం ఉండేది.
రాజకీయ నాయకులు అంటేనే ఒకరిమీద ఒకరు ఎప్పుడూ విమర్శలు చేసుకుంటూ ఉంటారు. టైం వస్తే చాలు ఒకరిని ఒకరు చెడుగుడాడుకుంటారు. ఒకప్పుడు.. పబ్లిక్ మీటింగ్స్‌లో మాత్రమే ఒకరిని ఒకరిని ఒకరు విమర్శించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో ప్రతీ ఒక్కరూ ప్రత్యర్థి పార్టీ నేతలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసి పడేస్తున్నారు. ముగులు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వరకూ ఈ ప్రకంపణలు వచ్చాయంటే భూకంపం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటూరునాగారం అటవీ ప్రాంతం కేంద్రంగా 40 కిలో మీటర్ల లోతు నుంచి ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 5.3 మాగ్నిట్యూడ్ తీవ్రత రికార్డ్ అయ్యింది. గడిచిన 30 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి లింక్ చేసి తెగ ట్రోల్ చేస్తున్నరు ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వరంగల్‌లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో రైతు రుణమాఫీ గురించి సీఎం రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారు. సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఆగస్ట్‌లోపు తెలంగాణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానంటూ శపథం చేశారు. అప్పటి వీడియోను ఇప్పుడు భూకంపం వీడియోలతో మెర్జ్ చేసి వైరల్ చేస్తున్నారు బీఆర్‌ఎస్ కార్యకర్తలు. తెలంగాణలో పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదు అనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణ. సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఒట్టేసి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పాడని.. ఆ కారణంగానే ములుగు కేంద్రంగా భూకంపం వచ్చిందంటూ ట్రోల్ చేస్తున్నారు. సీఎం పదవిలో ఉండి దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పితే ప్రజలు క్షమించినా ప్రకృతి, దేవుడు క్షమించరంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. సీఎం ఇచ్చే దొంగ హామీల వళ్ల తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా నష్టపోతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గట్టిగానే రిప్లై ఇస్తున్నారు. ఏది ఏమైనా ప్రకృతి వైపరిత్యాన్ని కూడా వీళ్ల రాజకీయాలకు సింక్ వాడుకుంటున్న వీళ్ల క్రియేటివిటీ చూసి కామన్ పీపుల్ నవ్వుకుంటున్నారు.