BJP-BRS: బీజేపీ–బీఆర్ఎస్ పక్కా స్కెచ్.. ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది..?
తెలంగాణలో 10యేళ్ళు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల్లో జరిగిన అవినీతి బయటపడుతోంది. గొర్రెల పథకం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు.. ఇలా కేసీఆర్ హయాంలో ఏ పథకం ముట్టుకున్నా అడుగడుగునా అవినీతే కనిపిస్తోంది.
BJP-BRS: లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ, కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు మారతాయా..? బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వాలకు ముప్పు తప్పదా..? తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా..? ఆ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికలకు ముందే కలుస్తాయా.. తర్వాత కలుస్తాయా.. బీజేపీతో కలవకపోతే మనుగడ లేదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా..? ఇప్పుడు తెలంగాణలో దీనిపైనే హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.
ALLU ARJUN-REVANTH REDDY: రేవంత్‌కు అల్లు అర్జున్ మద్దతు.. మామ కోసం ఏం చేయబోతున్నారంటే..
తెలంగాణలో 10యేళ్ళు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల్లో జరిగిన అవినీతి బయటపడుతోంది. గొర్రెల పథకం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు.. ఇలా కేసీఆర్ హయాంలో ఏ పథకం ముట్టుకున్నా అడుగడుగునా అవినీతే కనిపిస్తోంది. దాంతో కేసీఆర్ అండ్ కోను జైలుకు పంపేదాకా సీఎం రేవంత్ రెడ్డికి నిద్రపట్టడం లేదు. కాకపోతే లోక్‌సభ ఎన్నికల దాకా ఓపిక పడుతున్నారని అంటున్నారు. తనను కేసీఆర్ ఎలా జైలుకు పంపారో.. అదే పరిస్థితి ఆయనకు తీసుకురావాలని రేవంత్ భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలైనా కాలేదు. ఇప్పుడే అరెస్టులు అంటే.. రాజకీయ కక్షసాధింపు చర్యలు అని జనం అనుకునే ప్రమాదం ఉందని ఆలోచిస్తున్నారు రేవంత్. కానీ కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలే ఆయన్ని జైలుకు పంపేలా ఉన్నాయి. అయితే రాబోయే రోజులను ఊహించుకొని బీఆర్ఎస్ నేతలు భయంతో వణికిపోతున్నారు. అందుకే ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్రంలో అండ ఉంటుందని భావిస్తున్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ సీనియర్ల మధ్య హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.
పొత్తు ఇప్పుడే పెట్టుకోవాలా.. రేపు బీజేపీ అధికారంలోకి వచ్చాక మద్దతు ఇవ్వాలా అన్నదానిపై ఇంటర్నల్‌గా డిస్కషన్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీతో కలవకపోతే మాత్రం పార్టీ మనుగడ కష్టమంటున్నారు కొందరు BRS లీడర్లు. కేంద్రంలో BJP ఆధ్వర్యంలోని NDA ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. థర్డ్ టైమ్ పవర్ చేజిక్కితే.. ఇక కాంగ్రెస్ పని ఔట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహారాష్ట్ర సహా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని సంకీర్ణ ప్రభుత్వాలను అధికారం నుంచి దింపేయడంలో బీజేపీ ముందుంది. అదే పరిస్థితి కర్ణాటక, తెలంగాణలోనూ జరుగుతుందన్న అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో BRSకు 39, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2029నాటి వరకైనా తెలంగాణలో ఒంటరిగా ప్రభుత్వం స్థాపించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీతో దోస్తీ లేదని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు. కానీ లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ ఏం స్టెప్ వేయబోతోంది.. బీఆర్ఎస్‌తో కలుస్తుందా.. లేదా అన్నది చూడాలి.