KCR Again: తెలంగాణలో మళ్లీ కారుదే అధికారం.. డౌట్‌ ఉంటే ఈ లెక్కలు చూడండి…

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, లెక్కలు చూస్తే.. కారు జోరుకు బ్రేకులు పడే చాన్స్ కూడా కనిపించడం లేదు. కారు పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు అంటే టక్కున చెప్పలేని పరిస్థితి. ఇది చాలు మళ్లీ బీఆర్ఎస్‌దే అధికారం అని చెప్పడానికి !

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2023 | 12:38 PMLast Updated on: Mar 17, 2023 | 12:38 PM

Brs Will Win Again In Telangana

తెలంగాణ రాజకీయం భగ్గుమంటోంది. ఒకరికి తర్వాత ఒకరు.. ఒకరికి మించి ఒకరు.. మాటల తూటాలు సంధిస్తున్నారు. పొలిటికల్‌ సీన్‌ను మరింత హీటెక్కిస్తున్నారు. రోజుకో రకంగా మారుతోంది రాజకీయం. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారం ఎవరిది అనే చర్చ సాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం పీక్స్‌కు చేరినా.. కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. క్షేత్రస్థాయిలో హస్తం పార్టీకి బలం, బలగం ఇప్పటికీ అలానే ఉంది. యాక్టివ్‌ చేసే లీడర్ లేరు అంతే ! దీంతో అధికారం దక్కబోయేది ఎవరిది అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, లెక్కలు చూస్తే.. కారు జోరుకు బ్రేకులు పడే చాన్స్ కూడా కనిపించడం లేదు. కారు పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు అంటే టక్కున చెప్పలేని పరిస్థితి. ఇది చాలు మళ్లీ బీఆర్ఎస్‌దే అధికారం అని చెప్పడానికి ! నిజానికి బీజేపీతో బీఆర్‌ఎస్‌కు యుద్ధం జరుగుతున్నా.. ఇప్పటికిప్పుడు తెలంగాణలో పాగా వేసే స్థాయి కమలం పార్టీకి లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన లీడర్ లేడు ఆ పార్టీకి ! ఇక కాంగ్రెస్ సంగతి సరేసరి. అంతర్గత పోరు.. హస్తం పార్టీని ఇబ్బంది పెడుతోంది. రేవంత్ వర్సెస్ సీనియర్ల వివాదం.. బీఆర్ఎస్‌కు గెలుపు దారులు చూపిస్తున్న పరిస్థితి. ఇక అటు బీఎస్పీ, వైటీపీ, ప్రజాశాంతి.. ఇలా చాలా పార్టీలు 2023 బరిలో కనిపించబోతున్నాయ్. ఇది కూడా కారు పార్టీకి ప్లస్ కావడం ఖాయం. రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా గులాబీ పార్టీ మీద జనాల్లో అంతో ఇంతో వ్యతిరేకత ఉంది. ఐతే పోటీలో పార్టీలు పెరిగినా కొద్దీ.. ఆ వ్యతిరేకత చీలిపోయే అవకాశం ఉంటుంది. ఓట్లు కూడా చీలిపోతాయ్. అది కారు పార్టీకి అనుకూలంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్‌ మీద విపక్షాలు అవినీతి అస్త్రాలు సంధించినా.. ఇప్పటికిప్పుడు అది వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఈ ఆరోపణలు, విచారణలు.. గ్రౌండ్ లెవల్‌లో ఓటర్‌ మనసు మార్చేంత ప్రభావం చూపించకపోవచ్చు. దీంతో ఎలా లెక్క చూసినా.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. కారు జోరును ఆపే అవకాశమే లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.