CONGRESS-BSP: బీఎస్పీతో హస్తం పార్టీకి నష్టం తప్పదా.. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్‌ను దెబ్బతీస్తుందా..?

ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లలో చాలామంది కాంగ్రెస్ వైపే ఉన్నా.. బీఎస్పీ కూడా కొన్ని వర్గాల ఓట్లు చీల్చుకుంటోంది. రాష్ట్రంలో దళిత ఓటు బ్యాంక్‌నే చీలిక వచ్చే ఛాన్సుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల.. అది పరోక్షంగా అధికారపార్టీ బీఆర్ఎస్‌కు కలిసొచ్చే అవకాశముంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 24, 2023 | 03:02 PMLast Updated on: Nov 24, 2023 | 3:02 PM

Bsp Effect On Congress Party In Telangana Assembly Elections

CONGRESS-BSP: తెలంగాణ రాష్ట్రంలో BRS ప్రభుత్వ వ్యతిరేక ఓట్లల్లో చీలిక వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ, వైఎస్సార్‌టీపీ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నాయి. ఈ రెండు పార్టీల సానుభూమతిపరుల ఓట్లు కాంగ్రెస్‌కే పడతాయని భావిస్తున్నారు. కానీ బీఎస్పీ మాత్రం అధికార పార్టీ నుంచి కాకుండా.. కాంగ్రెస్ నుంచి ఓట్లు చీల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందిరా గాంధీ హయాం నుంచీ.. దళితుల ఓట్లల్లో చాలావరకూ హస్తం పార్టీకే పడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో బీఎస్పీ పోటీ చేయడంతో ఆ ఓట్లల్లో చీలక వచ్చే అవకాశాలున్నాయి.

రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ విధానాలపై కోపంగా ఉన్న ఓటర్లు ప్రతిపక్షాల వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు కొందరు ఇండిపెండెంట్స్ కూడా బరిలో ఉన్నారు. బీజేపీకి ఫిక్సుడ్‌గా కొంత ఓట్ బ్యాంక్ ఉంది. దీనికి తోడు ఎస్సీ వర్గీకరణ, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించండంతో ఈ రెండు వర్గాల్లో కొన్ని ఓట్లు కమలం పార్టీకి పడే ఛాన్సుంది. మిగిలిన ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లలో చాలామంది కాంగ్రెస్ వైపే ఉన్నా.. బీఎస్పీ కూడా కొన్ని వర్గాల ఓట్లు చీల్చుకుంటోంది. రాష్ట్రంలో దళిత ఓటు బ్యాంక్‌నే చీలిక వచ్చే ఛాన్సుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల.. అది పరోక్షంగా అధికారపార్టీ బీఆర్ఎస్‌కు కలిసొచ్చే అవకాశముంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Telangana Assembly: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే..

ప్రభుత్వ సర్వీసు వదులుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSP).. బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బడుగు బలహీన వర్గాలు, బహుజనులకు రాజ్యాధికారం అన్నది బీఎస్పీ నినాదం. తెలంగాణలో ఆ పార్టీకి ఇప్పటి వరకూ సరైన ఉనికి లేదు. RSPతో ఆ పార్టీకి కాస్త గుర్తింపు వచ్చే ఛాన్సుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలో బీఎస్పీ చేరలేదు. అటు ఎన్డీఏలో కూడా భాగస్వామి కాదు. కానీ అంశాల వారీగా బీజేపీకి సహకరిస్తోందన్న విమర్శలు ఆ పార్టీపై ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో బీఎస్పీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్‌కు సహకరిస్తోందన్న విమర్శలున్నాయి. బీఎస్పీకి సహజంగా ఉండే దళిత, బహుజన ఓట్లతోపాటు ప్రవీణ్ కుమార్‌కు వ్యక్తిగతంగా కూడా ఈ వర్గాల్లో అభిమానులు ఉన్నారు. రాష్ట్రంలో 20 నుంచి 30 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంటుంది.

Priyanka Gandhi Vadra: బీఆర్‌ఎస్‌‌ను చూసేది మ్యూజియంలోనే.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ

స్వల్ప ఓట్ల మెజారిటీతోనే గెలుపోటములు ఉండే ఛాన్సుంది. తక్కువ మార్జిన్‌తో గెలిచిన చోట్ల బీఎస్పీ ప్రభావం ఉందనే చెప్పుకోవాలి. బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో అన్ని సీట్లల్లో బీఎస్పీ పోటీచేయడం వల్ల నష్టపోయేది కాంగ్రెసే పార్టీనే అంటున్నారు విశ్లేషకులు. ఈ సీట్లల్లో బీఎస్పీ ఓట్లు చీలిస్తే అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే ఛాన్సుంది. బీఎస్పీ అన్ని స్థానాల్లో పోటీ చేయకుండా ఉంటే బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ప్రభుత్వ ఓటు చీలకుండా ఉండేదని అంటున్నారు.