ఏకగ్రీవం చేస్తా, ఏం పీ** పీకండి: బీటెక్ రవి

పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం అవ్వడంతో పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బిటెక్ రవి సంచలన కామెంట్స్ చేసారు. 1978 నుంచి నిర్మించుకున్న మీ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పేకలించిన ఘనత మా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు చెందుతుందన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2024 | 05:55 PMLast Updated on: Dec 14, 2024 | 5:55 PM

Btech Ravi Sensational Comments On Ys Jagan

పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం అవ్వడంతో పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బిటెక్ రవి సంచలన కామెంట్స్ చేసారు. 1978 నుంచి నిర్మించుకున్న మీ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పేకలించిన ఘనత మా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు చెందుతుందని… పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగం పోయిందన్న రవి… భారత రాజ్యాంగం మాత్రమే ఉందన్నారు. పులివెందుల నియోజకవర్గంలో మా పార్టి నాయకులు, కార్యకర్తలు మీసం మెలేస్తున్నారని రవి ఘాటు వ్యాఖ్యలు చేసారు.

గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టిన కూడా మా పార్టీ అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్ వెయ్యడానికి ముందుకువచ్చారన్న ఆయన… ఇప్పుడు సాగునీటి ఎన్నికల సందర్భంగా మీ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వెయ్యడానికి కూడా MRO కార్యాలయాల దరిదాపుల్లోకి కూడా రాలేదన్నారు. అస్సలు సిస్సలు దద్దమ్మలు మిరే మేము కాదని రవి వైసీపీ నేతలను ఎద్దేవా చేసారు. చేతగాని దద్దమ్మలు కాబట్టే సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేదు అన్నారు.

మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది అంటూ ప్రశ్నించారు. ఇంకా సిగ్గు లేకుండా భాయ్ కాట్ చేశాము అని గొప్పగా చెప్పుకుంటున్నారన్న ఆయన… ఇది ట్రైలర్ మాత్రమే ముందుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధానాన్ని అవలంభిస్తాం, మీకు దమ్ముంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయండి అంటు పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి,ఎంపీ అవినాష్ రెడ్డికి సవాలు చేసారు రవి.