నువ్వొక బ్రోకర్ రా, పరువు ఎక్కడిది: రెచ్చిపోయిన బుద్దా
విజయసాయి రెడ్డికి పరువు లేదు, పరువు లేని వ్యక్తి విజయ సాయి రెడ్డి అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేసారు. మానవ విలువలు తెలియని వ్యక్తి విజయసాయి రెడ్డి అని... నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ మండిపడ్డారు.

విజయసాయి రెడ్డికి పరువు లేదు, పరువు లేని వ్యక్తి విజయ సాయి రెడ్డి అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేసారు. మానవ విలువలు తెలియని వ్యక్తి విజయసాయి రెడ్డి అని… నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి కుల పిచ్చి ఉందేమో… చంద్రబాబు నాయుడుకి కుల పిచ్చి లేదన్నారు. ఏ కులం లేని బాబుకు కుల పిచ్చి అంటగడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. విజయసాయి రెడ్డి పై క్రిమినల్ కేసు వేస్తాను అని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.
చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంతో మంది టిడిపి నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. ఐదేళ్లపాటు చనిపోకుండా బతికి ఉంటే జైలుకు పంపుతామని అంటారా అని మండిపడ్డారు. కాకినాడ సిపోర్టును కె.వి.రావు అభివృద్ధి చేశారని… కె.వి.రావ్ చంద్రబాబు ఒకే కులమని కులం అంటగట్టుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వ ఆయాయంలో ఎవరైనా వ్యాపారవేత్తలు కేసులు పెట్టారా అని నిలదీశారు. భయపెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకుంటారా అంటూ మండిపడ్డారు.
విజయసాయిరెడ్డి ఒక బ్రోకర్ బ్రోకర్ కాబట్టే రాజ్యసభ సీటు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నేతలకు భయపడి ఆనాడు బయటికి వచ్చేందుకు ఎవరు ధైర్యం చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు వాళ్లంతా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను బాబుకు విన్నవిస్తున్నారన్నారు. అధికారం అడ్డుపెట్టుకొని ఎంతోమంది ఆస్తులను లాక్కున్నారని ఆయన ఆరోపించారు.