సాయి రెడ్డి.. చంద్రబాబు వదిలినా నేను వదలను: బుద్దా వార్నింగ్
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. జగన్ రెడ్డి, విజయసాయి కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని మండిపడ్డారు. జగన్ కి తెలిసే అంతా జరుగుతుందన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. జగన్ రెడ్డి, విజయసాయి కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని మండిపడ్డారు. జగన్ కి తెలిసే అంతా జరుగుతుందన్నారు. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడతున్న నాటకం ఇదంతా అని మండిపడ్డారు. చంద్రబాబు గారితో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్ళు కాదు ప్రజలన్నారు.
విజయసాయి రెడ్డి చంద్రబాబు గారిని అన్న ప్రతి మాట మాకు ఇంకా గుర్తు ఉందన్నారు. చేసినవి అని చేసి ఈరోజు రాజీనామా చేసి వెళ్ళిపోతా అంటే కుదరదు అని హెచ్చరించారు. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో నువ్వు చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలని స్పష్టం చేసారు. సీబీఐ విజయసాయి రెడ్డిని దేశం విడిచి వెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదన్నారు. విజయసాయి రెడ్డి… నువ్వు చంద్రబాబును, వారి కుటుంబాన్ని అన్న మాటలు ఎవరూ మర్చిపోయినా నేను మర్చిపోనని.. నువ్వు పెట్టిన ప్రతి ట్వీట్ కు నేను ఇచ్చిన సమాధానం గుర్తు ఉంది కదా అంటూ పోస్ట్ చేసారు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు క్షమించినా నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.